ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి పాఠశాలలో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్‌ తప్పనిసరి

ABN, Publish Date - Jul 09 , 2024 | 11:10 PM

ప్రభుత్వ, జిల్లా పరిషత, ఏపీ మోడల్‌ స్కూళ్లతో పాటు అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ స్టేట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌, రాయలసీమ జోన ఇనచార్జి ఉమాదేవి తెలిపారు.

కస్తూరిబా పాఠశాల బాలికలతో మాట్లాడుతున్న స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ స్టేట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌ ఉమాదేవి

స్టేట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌ ఉమాదేవి

రాయచోటిటౌన, జూలై 9: ప్రభుత్వ, జిల్లా పరిషత, ఏపీ మోడల్‌ స్కూళ్లతో పాటు అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ స్టేట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌, రాయలసీమ జోన ఇనచార్జి ఉమాదేవి తెలిపారు. స్టేట్‌ సెక్రటరీ ఆదేశాల మేరకు మంగళవారరం ఉదయం రాయచోటిలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలోని భారత స్కౌట్స్‌స అండ్‌ గైడ్స్‌ యూనిట్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, అంకితభావం పెంపొందడానికి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ తోడ్పడుతుందన్నారు. అంతేగాక స్కౌట్స్‌ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసం , ఉజ్వల భవిష్యత్తు, ఉన్నత విలువలు సమకూరతాయన్నారు. ్ట ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్‌ ఏర్పాటుకై తమ పాఠశాల తరపున 381 రూపాయలు చెల్లించి రిజిస్ర్టేషన చేయించాల న్నారు. పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా యూనిట్లను ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. తమ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో ఒకరిని స్కౌట్స్‌ మాస్టర్‌గా, మరొకరిని గైడ్స్‌ కెప్టెనగా నియమించుకోవచ్చు నన్నారు. అనంతరం విద్యార్థుల ఎంపికను పూర్తి చేయాలన్నారు. గత సంవత్సరం యూనిట్‌ ఏర్పాటు కోసం రిజిస్ర్టేషన చేసిన వారు ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా రెన్యువల్‌ చేసుకోవాలన్నారు. బాలురు (స్కౌట్స్‌), బాలికలు (గైడ్స్‌)తో కూడిన స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్స్‌లలో బాలురకు ఒక యూనిట్‌, బాలికలకు మరొక యూనిట్‌ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు యూనిట్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్కౌట్‌ మాస్టర్లకు, గైడ్‌ కెప్టెన్లకు బేసిక్‌ శిక్షణను ఇచ్చి వారికి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. అనంతరం అన్నమయ్య జిల్లా భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్‌లో చేరిన విద్యార్థులకు రెండేళ్లు శిక్షణ, క్యాంపుల్లో భోజన వసతి కల్పిస్తామన్నారు. శిక్షణలో తృతీయ సోపానం, రాజ్యపురస్కార కోర్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించి ప్రతిభ చూపిన వారికి గవర్నర్‌ జారీ చేసిన సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సర్టిఫికెట్‌ కలవారికి జీవో నెంబర్‌ 27 ప్రకారం విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం సంబేపల్లె, రామాపురం మండలాల కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లోని భారత గైడ్స్‌ యూనిట్లను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ రాధా, అసిస్టెంట్‌ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కమిషన లక్ష్మీకర్‌, గైడ్‌ కెప్టెన్లు రమీజా, పుష్పాంజలి, హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 11:10 PM

Advertising
Advertising
<