ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిమ్మనపల్లిలో పునుగు పిల్లి

ABN, Publish Date - Jun 13 , 2024 | 11:20 PM

మండలంలోని కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లిలో గురువారం తన ఇంటి వద్ద అరుదైన పుగుగుపిల్లిని హోంగార్డ్లు శ్రీనివాసులు కనుగొన్నారు

పునుగు పిల్లి

నిమ్మనపల్లి, జూన 13: మండలంలోని కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లిలో గురువారం తన ఇంటి వద్ద అరుదైన పుగుగుపిల్లిని హోంగార్డ్లు శ్రీనివాసులు కనుగొన్నారు. తెల్లవా రు జామున వేకువ జామున తన ఇంటి వద్ద కుక్కలు మొరుగుతుండగా వెళ్లి చూడగా అక్కడ పొదల్లో పిల్లి లాంటి జంతువు కనిపించిదన్నారు. వెంటనే కుక్కలను తోలి ఆ పిల్లిని పట్టుకుని గోనెసంచిలో వేశాడు. అయితే ఆ పిల్లి ఆకారం మరోలా ఉండటంతో అటవీ సిబ్బందికి సమాచారం అందించాడు. అటవీ శాఖ సిబ్బంది వచ్చేంత వరకు స్థానిక పోలీ్‌సస్టేషనలో దానిని ఉంచారు. అనంతరం అటవీశాఖ గార్డు దీప అక్కడకు చేరుకుని పిల్లిని పరిశీ లించి దాని ఫోటోను తీసి ఉన్నతాదికారులకు పంపగా వారు పునుగు పిల్లిగా గుర్తించారు. అనంతరం అటవీ సిబ్బంది తవళం అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీనేల్మేశ్వరస్వామి ఆలయం వద్ద అడవిలో దానిని వదిలి పెట్టారు. కాగా తిరుమల వేంకటేశ్వరస్వామికి అభిషేక సేవకు పునుగు పిల్లి తైలాన్ని ప్రతి శుక్రవారం వాడతారని తెలిసింది. దీని తైలం కారణంగానే శ్రీనివాసుడు నిత్యం ప్రకాశిస్తుంటాడని చెబుతుంటారు.

Updated Date - Jun 13 , 2024 | 11:20 PM

Advertising
Advertising