ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శివ కుటుంబానికి ఎనఆర్‌ఐ సాయం

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:16 PM

కువైత ఎడారిలో దు ర్భర జీవనం గడుపు తున్న వాల్మీకిపురం చింతపర్తి గ్రామానికి చెందిన శివ కుటుంబానికి టీడీపీ ఎనఆర్‌ఐ లోకేశ కొణెదల ఆర్థికసాయం అందించారు.

మదనపల్లె టౌన, జూలై 15: కువైత ఎడారిలో దు ర్భర జీవనం గడుపు తున్న వాల్మీకిపురం చింతపర్తి గ్రామానికి చెందిన శివ కుటుంబానికి టీడీపీ ఎనఆర్‌ఐ లోకేశ కొణెదల ఆర్థికసాయం అందించారు. శివ నెల రోజుల క్రితం ఉపాధి కోసం కువైత వెళ్లగా అతడిని ఎడారిలోని నిర్మానుష్యంగా ఉన్న స్థలంలో కోళ్లు, పావురాలు, కుక్కల పెంపకం విధులు కేటాయించడం, అక్కడ శివ పడుతు న్న బాధలను సెల్ఫీ వీడియో ద్వారా వైరల్‌ చేయడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ స్పందించిన విషయం తెలిసిందే. శివను ఇండియాకు తీసుకురావడానికి మంత్రి లోకేశ ఇప్పటికే విదేశాంగశాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో టీడీ పీ ఎనఆర్‌ఐ లోకేశ కొణెదల మదనపల్లెకు వచ్చిన శివ భర్య శంకరమ్మ, కుమార్తెలు వెన్నెల, వనితలను విచారించి అతను క్షేమంగా తిరిగి వస్తాడని భరోసా ఇచ్చారు. దీంతో పాటు శంకరమ్మ కుటుంబానికి రూ.25 వేలు ఆర్థికసాయం అందజేశారు.

బాధిత కుటుంబానికి చేయూత..

వాల్మీకిపురం, జూలై 15: బతుకుదెరువు కోసం కువైతకు వెళ్లి ఎడారిలో వేధింపులకు గురైన శివ కుటుంబానికి స్థానిక టీడీపీ నాయకులు అండగా నిలిచారు. సోమవారం స్థానిక సర్పంచ మహిత శేషాద్రిరెడ్డి ఆధ్వర్యంలో శివ కుటుంబానికి సాయం అందించారు. బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి శివ భార్య శంకరమ్మ, పిల్లలకు ధైర్య చెప్పారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ దీనిపై విదేశాంగ శాఖతో మాట్లాడారని, ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి కూడా స్పందించారని, శివను ఇండి యాకు తీసుకువస్తారని వారికి మీ కుటుంబాన్ని ఆదుకుంటా మని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ద్వారకనాథరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:16 PM

Advertising
Advertising
<