ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పులివెందులలోనూ బలవంతమే..!

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:16 PM

పులివెందులలోనూ వార్డు వలంటీర్ల బలవంతపు రాజీనా మాలు సాగుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే వలంటీర్లతో బలవంతపు రాజీనామాలు సాగించడం చర్చనీయాంశమైంది.

రెండు రోజులుగా వలంటీర్లతో రాజీనామాలు

కడప, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పులివెందులలోనూ వార్డు వలంటీర్ల బలవంతపు రాజీనా మాలు సాగుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే వలంటీర్లతో బలవంతపు రాజీనామాలు సాగించడం చర్చనీయాంశమైంది. అనేక జిల్లాల్లో వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అది ఎన్నికల కమిషన్‌ దృష్టికి వెళ్లి కేసులు నమోదు చేయ డం జరుగుతోంది. దీంతో వలంటీర్లను రాజీనామా చేయాలని ఆయా ప్రాంత వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా ఇదే పరంపర కొనసాగడం హాస్యాస్పదంగా ఉంది. రెండు రోజులుగా వలంటీర్లను రాజీనామా చేయాలని పులివెందుల నేతలు ఒత్తిడి తెస్తున్నారు. బుధవారం సుమారు 130 మంది వలంటీర్లతో రాజీనామా చేయించారు. అలాగే గురువారం కూడా 70 నుంచి 90 మందితో రాజీనామా చేయించినట్లు తెలిసింది. రాజీనామా చేస్తున్న వారికి రూ.5వేల నుంచి రూ.10వేలు నగదు అందించినట్లు తెలిసింది. ఐదేళ్లుగా వాడుకుని ఉన్నట్లుండి రాజీనామాలు చేయమనడం బాగోలేదని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పులివెందులకు చెందిన ఓ అధికారిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా రాజీనామాలు చేయడం వాస్తవమే అన్నారు. కొందరు నేతలు ఒత్తిడి తేవడంతో రాజీనామాలు చేశారని అన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:16 PM

Advertising
Advertising