వైభవంగా వాసవీ జయంత్యుత్సవాలు
ABN, Publish Date - May 17 , 2024 | 11:49 PM
స్థానిక వాసవీభవన వీధిలోని కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి జయంత్యుత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
మదనపల్లె అర్బన, మే 17: స్థానిక వాసవీభవన వీధిలోని కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి జయంత్యుత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈనె 20వ తేదీవరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మదనపల్లె ఆర్యవైశ్య సంఘం నేతలు పేర్కొన్నారు. కాగా శుక్రవారం వాసవీమాత ఆలయలో ఉదయం సుప్రభాత సేవతో మేల్కోల్పి మదన పల్లె ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అభిషేకాలు అర్చనలతో విశేషపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహామంగళ హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారి సహస్రనా మపారాయణం చేశా రు. ఇదిలా ఉండగా శనివారం (ఈనెల 18న) వాసవీ మాత జయంతి సందర్భంగా ఉదయం 5.30 గంటలకు ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయం నుం చి కన్యకలు, దంపతులచే గంగ తెచ్చు కార్యక్రమం, ఉదయం 10గంట లకు గణపతి హోమం, వాసవీమాత మూలమంత్ర హోమం, 11 గంటలకు పూర్ణాహుతి, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. సాయంత్రం 5గంటలకు పుష్పపల్లకి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్, దేవతాసతీష్, సూరేగిరిధర్ తోపాటు ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు, వాసవీ క్లబ్ సభ్యులు, యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వీరబ్రహ్మేంద్ర ఆరాధనోత్సవాలు
మదనపల్లె అర్బన, మే 17: వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు స్థానిక వీరబ్రహేంద్ర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు, నవయుగ స్వర్ణకారుల సంఘం, విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం అభిషేకాలు, అర్చనలు విశేషంగా పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయంలో నవయుగ స్వర్ణకా రుల సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అప్పినిపల్లె భాస్కరాచారి ఆధ్వర్యంలో సుమారు రెండు వేలమంది అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణాచారి, ప్రసాద్, యుగంధర్, చంద్ర, ప్రభాకర్, దిలీఫ్, చిన్ని, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ముత్యాలమ్మ తిరుణాల
ములకలచెరువు, మే 17: మండలంలోని బురకాయలకోట సమీపంలో వెలసిన ముత్యాలమ్మ తిరుణాల ఉత్సవాలు శనివారం నుంచి జరుగు తాయని నిర్వాహకులు తెలిపారు. శనివారం గోపూజ, ఆలయ శుద్ధి, గణపతి పూజ, కలశస్థాపన, కుంకుమార్చన, మహా మంగళహారతి ఉంటుందన్నారు. ఆదివారం కూష్మాండబలి, జ్యోతులు సమర్పణ, , సోమవారం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
Updated Date - May 17 , 2024 | 11:49 PM