సమరశీల పోరాటాలకు ప్రతీక సీఐటీయూ
ABN, Publish Date - Jun 09 , 2024 | 10:48 PM
సమరశీల పోరాటాలకు ప్రతీక సీఐటీయూ అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రెసిడెంట్ కే. నాగభూషణం అన్నారు.
రాయచోటిటౌన, జూన9: సమరశీల పోరాటాలకు ప్రతీక సీఐటీయూ అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రెసిడెంట్ కే. నాగభూషణం అన్నారు. ఆదవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మున్సిపల్ వర్కర్ల జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 55 ఏళ్ల కాలంలో అనేక రకాల కార్మికులకు సంఘాలు పెట్టి వారి హక్కులు, చట్టాల అమలుకు నీతి, నిజాయితీ క్రమశిక్షణతో రాజీలేకుండా పోరాడుతోందన్నా రు. గత డిసెంబర్‌లో మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఆప్కాస్ రద్దు చేయాలని సమ్మెలో మొదటి అడుగు వేసి చివరి వరకు జీవోల సాధనకు పోరాటం చేసిన సంఘం సీఐటీయూ అని కొనియా డారు. అంగన్వాడీ, ఆశ, సంఘమిత్ర, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు నాయ కత్వం వహించడమే గాక వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో కూడా సీఐటీయూ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. పెట్టుబడిదారీ ప్రభుత్వాలను కూల్చి కార్మిక వర్గ రాజ్యస్థాపన చేయడమే ధ్యేయంగా సీఐటీయూ పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సీఐటీయూ విస్తరణకు నడుం బిగించాలని కోరారు. సీఐటీయూ విధానాలు నచ్చడంతో 28 మంది మున్సిపల్ పారిశుధ్యం, ఇంజనీరింగ్ కార్మికులు స్వచ్ఛందంగా సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పీ. శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామాంజులు వారిని అభినందిస్తూ, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు రకాల లేబర్ కోడ్‌లు రద్దు అయ్యేంత వరకు సీఐటీయూ పోరాడుతుందన్నారు. సీఐటీయూలో చేరిన వారిలో బీవీ రమణ, శంకరయ్య, చంద్రశేఖర్, ఈశ్వర్‌రెడ్డి, ప్రభాకర్, మహేశ, వెంకటలక్ష్మి, మౌనిక, చిన్మిమ్మి, రమేశబాబు, ఈశ్వరమ్మ, సావిత్రి, యశోద, గిరి, నాగసుబ్బులు, శంకర, షఫీ, సురేశ, అంజి, నాగేశ్వరి, పురుషోత్తం, జయరాం, పార్థసారథి, మధుకర్ తదితరులు మాట్లాడుతూ సీఐటీయూ విధానాలు అనుకరిస్తూ పోరాటాలు పెరుగుదలకు కృషి చేయ డంతో పాటు సంఘం మరింత బలోపేతానికి విస్తరణకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఓబులమ్మ, మున్సిపల్ జిల్లా నాయకులు లక్ష్మిదేవి, ప్రసాద్, రమణ, పెంచలయ్య, సాలమ్మ, రవిశంకర్, చెన్నయ్య, రాంబాబు, వెంకట్రమణ, కేశమ్మ, శుభాషిణి, ఉమామహేశ్వరి, ఆంజనేయులు, కేశమ్మలతో పాటు పలువురు పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2024 | 10:48 PM