ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దాడికి నిరసనగా న్యాయవాదుల విధుల బహిష్కరణ

ABN, Publish Date - Apr 23 , 2024 | 10:59 PM

కడప కోర్టులో బాధితుల తరపున సివిల్‌ కేసు దాఖలు చేసి, వారికి అండగా నిలిచినందుకు ప్రతివాదులు న్యాయవాది పీ. శివసుధాకర్‌పై దాడి చేసినందుకు నిరసనగా మంగళవారం రాయచోటి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు.

రాయచోటి కోర్టు వద్ద విధులు బహిష్కరించిన నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

రాయచోటిటౌన, ఏప్రిల్‌ 23: కడప కోర్టులో బాధితుల తరపున సివిల్‌ కేసు దాఖలు చేసి, వారికి అండగా నిలిచినందుకు ప్రతివాదులు న్యాయవాది పీ. శివసుధాకర్‌పై దాడి చేసినందుకు నిరసనగా మంగళవారం రాయచోటి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రాయచోటి బార్‌ అసోసియేషన ప్రధాన కార్యదర్శి పీ. రెడ్డెయ్య, సహాయ కార్యదర్శి డీ. నాగముని విలేకరులతో మాట్లాడుతూ డీ. సుహాసిని అనే మహిళకు సంబంధించిన కేసులో శివసుధాకర్‌ అనే న్యాయవాది మార్చి 14న కడప కోర్టులో ఇంజక్షన ఆర్డరు తీసుకున్నారు. అయినా, నిందితులు దౌర్జన్యం ఆపకపోవడంతో బాధితురాలు కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనంతటికీ కారణం లాయరేన్న ఉద్దేశంతో ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో ఎర్రముక్కపల్లె క్రాస్‌ వద్ద సుబ్బమ్మ, హరి, హరిప్రసాద్‌, సునీత దాడి చేయగా, అతని వెన్నెముక దెబ్బతిన్నదన్నారు. దాడి చేసిన వారిలో సునీత అనే మహిళకు రాజకీయ పలుకుబడి ఉండడంతో పోలీసులు ఆమె పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదన్నారు. న్యాయవాదిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ న్యాయవాదులు రాజ్‌కుమార్‌రాజు, ఆనంద్‌కుమార్‌, చిన్నయ్య, కృష్ణయ్య, దేవేంధర్‌రెడ్డి, హుమయూనబాషా, భరతకుమార్‌రెడ్డి, రెడ్డిబాషా, మిఠాయిగిరి ఖాదర్‌బాషా, రవిశంకర్‌, నిరంజన, వరలక్ష్మి, ఖుష్ణుమా, ఖిజర్‌అలీఖాన, ఉత్తేజ్‌కుమార్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 10:59 PM

Advertising
Advertising