బంద్ ప్రశాంతం.. నామమాత్రం!
ABN, Publish Date - Aug 21 , 2024 | 11:29 PM
స్సీ వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం ఆధ్వ ర్యంలో పట్టణంలో బంద్, ర్యాలీ నిర్వహిం చారు.
మదనపల్లె అర్బన, ఆగస్టు 21: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం ఆధ్వ ర్యంలో పట్టణంలో బంద్, ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ తీర్పు వెనుకబడిన వర్గాల్లో చిచ్చు పెట్టిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం మోడీ చట్టాలను నాశనం చేస్తున్నట్లు ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు అమలు నిలుపుదల చేసేంత వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ యమలా చంద్రయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర్, జిల్లా అధికారప్రతినిధి మోహన, లక్ష్మీపతి, గ్యాస్ చంద్ర, మోహన, రమణ, రామకృష్ణ, రామచంద్ర, కృష్ణప్ప, రామ చంద్ర, తిప్పయ్య, చంద్రయ్య పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు మామూలుగానే తెరుచుకోవడంతో భారత బంద్ ప్రభావం కన్పించలేదు.
నిమ్మనపలి: స్థానిక బస్టాండు కూడలిలో మాలమహానాడు మండల అధ్యక్షుడు మాణిక్యం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారాలు కల్పించడం సమంజసం కాదన్నారు. తక్షణమే వర్గీకరణను ఆపివేయాలని లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సహదేవ, జయన్న, జగదీష్, వెంకటరమణ, సూర్యప్రకాప్, రెడ్డెప్ప, రాంబాబు పాల్గొన్నారు.
వాల్మీకిపురం: మండల కేంద్రంలో మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి వీరభద్ర య్య, జిల్లా అధ్యక్షుడు శివయ్య, ఉపాధ్యక్షుడు వెంకట స్వామి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించా రు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, దుకాణాలు మూయించారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, భూమా దేవేంద్ర, నాని, ప్రవీణ్, అశోక్, చిన్నసూరి, సుబ్రహ్మ ణ్యం, శ్రీను, నరేంద్ర, రమణ, రాజన్న, భాస్కర్, ఇరగప్ప, కృష్ణయ్య, నాగయ్య, రమణయ్య, శేఖర్, శ్రీను, తిమ్మయ్య, రామ్‌దాస్, రవి, చంద్ర, రాజన్న, పాపయ్య, కృష్ణప్ప పాల్గొన్నారు.
రామసముద్రం: మాలమహానాడు అధ్యక్షుడు కృష్ణప్ప ఆధ్వర్యంలో పాఠశాల లు, దుకాణాలు మూసి వేశారు. బస్సులు నడవలేదు. మాల మహానాడు నాయకులు రహదారిపై ధర్నా చేశారు. అంబేడ్కర్ అసోసియేషన అధ్యక్షుడు భాస్కర్, కృష్ణప్ప, శివశంకర్, నారాయణస్వామి, మెకానిక్ వెంకటేష్, శివ, రమణప్ప, శేషాద్రి, నరసింహులు, పవన, జైరాజు, బాలాజి, అరికెల రామాంజులు, మల్లి, నరసింహులు, శివ, హరి, సోము, నారాయణ మాలమహానాడు సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 11:29 PM