ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదర్శప్రాయుడు ఏపీజే అబ్దుల్‌కలాం

ABN, Publish Date - Jul 27 , 2024 | 11:03 PM

ప్రపంచం మెచ్చిన గొప్ప మేధావి మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు.

రాజంపేట: డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం వర్ధంతి సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటుతున్న బీజేపీ నేతలు

రాజంపేట, జూలై 27 : ప్రపంచం మెచ్చిన గొప్ప మేధావి మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు. శనివారం అబ్దుల్‌కలాం 9వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో మొక్కలు నాటారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్‌కలాం అణు, శాస్త్రీయ రంగాలకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. కలలు కనండి.. వాటి సాకారం కోసం కష్టపడండి అని చెప్పిన వ్యక్తి కలాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు రాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు రమణయ్య, వీరప్రసాద్‌, బీజేపీ నేతలు ఆదినారాయణ, షేక్‌ అబ్దుల్లా, టి.హరిప్రసాద్‌, శ్రీనివాసులు, పి.సూర్యచంద్ర, నవీనకుమార్‌, తోట నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాయచోటిటౌన: పట్టణంలోని అబ్దుల్‌ కలాం విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన షేక్‌ ఫయాజ్‌బాషా గజమాల వేసి నివాళులు అర్పించారు. కౌన్సిలర్లు అల్తాఫ్‌, గౌస్‌ఖాన, ఈశ్వర్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పెనగలూరు: ప్రతి విద్యార్థి అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకోవాలని అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్‌ అన్నారు. శనివారం పెనగలూరు ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్‌ మధుసూదనరెడ్డి అధ్య క్షతన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందినవారికి బహుమ తులు అందజేశారు. మైనార్టీమోర్చా జిల్లా అధ్యక్షుడు షబ్బీర్‌ అహ్మద్‌, నాయకులు సునీత, నారాయణ, పోతుగుంట నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు వి.శివారెడ్డి, వీహెచపీ నేతలు కె.నారాయణ, బి.గంగయ్య, టీడీపీ అధికార ప్రతినిధి కొత్త బాలక్రిష్ణ, వై.హరిబాబు, ఎం.శ్రీనివాసు లు, కె.శ్రీరాం, రమణయ్య, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పుల్లంపేట: కొత్తపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచఎం మల్లికార్జున ఆధ్వర్యంలో అబ్దుల్‌కలాం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళుల ర్పించారు. ఉపాధ్యాయులు రాజయ్య, సుకన్య, ఇంద్రావతి, సురేంద్ర, ప్రసాద్‌, చంద్రశేఖర్‌, వెంకటేశ్వర్లు, బాలశేఖర్‌లు పాల్గొన్నారు.

ఓబులవారిపల్లె: తల్లెంవారిపల్లె జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో బీజేపీ మండల అధ్యక్షుడు రాజగోపాల్‌రెడ్డి మొక్కలు నాటారు. విద్యా ర్థులకు పెన్నులు పంపిణీ చేశారు. నాయకులు వాకచర్ల సుబ్బారావు, చిన్నిరెడ్డి, గోవర్ధ్దనరెడ్డి, ఊటుకూరు చలపతి, సుబ్బరాయుడు, పోకల బాలాజీ, సుబ్రమణ్యం, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట టౌన : అణు సామర్థ్యంలో భారతదేశం తక్కువ కాదని నిరూపించిన గొప్ప శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం అని టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు చమర్తి జగన మోహనరాజు అన్నారు. శనివారం అబ్దుల్‌ కలాం 9వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ నేతలు, రోడ్డు రవాణా, రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ గుల్జార్‌బాషా, కోవూరు స్రుబమణ్యంనాయుడు, దగ్గుపాటి మణి, ఎస్‌కే కరీం, జిలానిబాషా, తుపాకుల బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 11:03 PM

Advertising
Advertising
<