ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్‌ ఫ్యాన్‌ రెక్కలు విరిచేయడం ఖాయం: ఆచంట

ABN, Publish Date - Apr 25 , 2024 | 04:14 AM

ఐదేళ్లలో పది సార్లు కరెంట్‌ చార్జీలు పెంచిన జగన్‌రెడ్డి ఫ్యాన్‌ రెక్కలు ఊడగొట్టడానికి మే 13న ఓటర్లంతా టీడీపీ కూటమి గుర్తులపై బటన్‌ నొక్కాలని తెలుగునాడు అంగన్వాడీ,

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో పది సార్లు కరెంట్‌ చార్జీలు పెంచిన జగన్‌రెడ్డి ఫ్యాన్‌ రెక్కలు ఊడగొట్టడానికి మే 13న ఓటర్లంతా టీడీపీ కూటమి గుర్తులపై బటన్‌ నొక్కాలని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత కోరారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో రూ.560 కోట్లు ఉన్న విద్యుత్‌ సర్‌చార్జీని రూ.1,500 కోట్ల కు పెంచిన జగన్‌రెడ్డి.. రూ.75 వేల కోట్ల భారం ప్రజలపై మోపాడు. ఐదేళ్ల క్రితం కరెంట్‌ బిల్లు 50 యూనిట్లకు రూ.60 వచ్చేది. ఇప్పుడు రూ.150 వ స్తోంది. గత ప్రభుత్వంలో 150 యూనిట్లు వాడితే రూ.400 బిల్లు వస్తే.. ఇప్పు డు రూ.900 వస్తోంది. అప్పుడు రూ.250 యూనిట్లకు రూ.1,114 వస్తే, ఇప్పుడు రూ.2,187 వస్తోంది. గతంలో 350 యూనిట్లకు రూ.1,950 వస్తే, ఇప్పుడు రూ.3,600 వస్తోంది. మరోవైపు అప్రకటిత విద్యుత్‌ కోతలతో రైతులు, వ్యాపారులు, వృద్ధులు, మహిళలు అల్లాడిపోతున్నారు. కరెంటు పట్టుకుంటే తగిలే షాక్‌ బిల్లులు పట్టుకుంటేనే తగులుతోందని ఆరోపించారు.

Updated Date - Apr 25 , 2024 | 07:24 AM

Advertising
Advertising