ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్‌రెడ్డి నంబర్‌ వన్‌ మోసగాడు

ABN, Publish Date - Apr 08 , 2024 | 03:49 AM

సీఎం జగన్‌రెడ్డి మోసం చేయడంలో నంబర్‌ వన్‌ అని మూతేసిన మూడు రాజధానుల శిబిరం నిర్వాహకుడు, దళిత బహుజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు.

3 రాజధానులు కావాలని దీక్ష చేసి మోస పోయాం

అమరావతి రైతులకు అండగా ఉంటాం

మంగళగిరి, తాడికొండలో టీడీపీకి లక్ష ఓట్ల మెజార్టీ తీసుకొస్తాం

మూతేసిన మూడు రాజఽధానుల శిబిరం నిర్వాహకుడు గురునాథం

తుళ్లూరు, ఏప్రిల్‌ 7: సీఎం జగన్‌రెడ్డి మోసం చేయడంలో నంబర్‌ వన్‌ అని మూతేసిన మూడు రాజధానుల శిబిరం నిర్వాహకుడు, దళిత బహుజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు. ఆదివారం తుళ్లూరు వచ్చి రాజధాని అమరావతి రైతులను ఆయన క్షమాపణ కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘మూడు రాజధానులు కావాలని 35 గంటలు దీక్ష కూడా చేశా. అప్పట్లో టీడీపీకి మెజార్టీ ఉన్న శాసన మండలికి మూడు రాజధానుల బిల్లు పంపటంలో సీఎం జగన్‌రెడ్డి వంచనను తెలుసుకున్నాం. బయటకు రావడానికి ఇంత సమయం పట్టింది. ఎటువంటి పరిస్థితిల్లోనూ మూడు రాజధానులు ఉండవని, అమరావతే రాష్ట్ర ఏకైక రాజధాని అని ఇప్పుడు తెలుసుకున్నాం. దీక్షలు చేసి మేము మోసపోయాం. అమరావతికి భూములిచ్చి జగన్‌ ఆడుతున్న మూడు ముక్కలాటతో మీరు మోసపోయారు. అమరావతి రైతులకు ప్రతి క్షణం అండగా ఉంటాం. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలలో ఉమ్మడి టీడీపీ అభ్యర్థులకు లక్ష ఓట్ల మోజార్టీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. లోకేశ్‌ అమరావతి రైతులను కలసి క్షమాపణ అడగమని చెప్పారు. వెంటనే మిమ్మల్ని కలవడానికి వచ్చా’ అని గురునాథం వివరించారు.

Updated Date - Apr 08 , 2024 | 03:49 AM

Advertising
Advertising