ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ISRO Chairman: ఈ ప్రయోగ విజయం 2024 కొత్త సంవత్సరానికి శుభారంభం

ABN, Publish Date - Jan 01 , 2024 | 11:22 AM

నూతన సంవత్సరం రోజున ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగ విజయం 2024 కొత్త సంవత్సరానికి శుభారంభమన్నారు. భూమికి 650 కిలోమీటర్ల దూరంలో నిర్ణిత కక్షలోకి ఎక్స్‌పోశాట్‌ చేరుకుందన్నారు.

నెల్లూరు: నూతన సంవత్సరం రోజున ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగ విజయం 2024 కొత్త సంవత్సరానికి శుభారంభమన్నారు. భూమికి 650 కిలోమీటర్ల దూరంలో నిర్ణిత కక్షలోకి ఎక్స్‌పోశాట్‌ చేరుకుందన్నారు. ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహం లోని సోలార్ ప్యానల్స్ విచ్చుకొని బ్యాటరీలను ఛార్జింగ్ చేసే పనిని ప్రారంభించిందని సోమనాథ్ తెలిపారు.

1963 తరువాత జరిగిన నేటి ప్రయోగ విజయంతో ఇస్రో 60 ఏళ్ళ చరిత్ర పూర్తి చేసుకుందన్నారు. నూతన సంవత్సరం రోజున ఈ రాకెట్ ప్రయోగ విజయం భారత ప్రజలకు ఇస్రో అందించిన బహుమతి అని సోమనాథ్ పేర్కొన్నారు. భవిష్యత్ ప్రయోగాలకు పరిశోధాత్మక ప్రయోజనాలకు ఈ ఉపగ్రహం కీలకమన్నారు. ఈ ఏడాదిలో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు ఉంటాయన్నారు. మానవ రహిత గగన్యాన్ ప్రయోగం కూడా ఈ ఏడాది ఉంటుందని సోమనాథ్ వెల్లడించారు.

Updated Date - Jan 01 , 2024 | 11:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising