ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సానుకూల దృక్పథమే సమస్యలకు పరిష్కారం

ABN, Publish Date - Jun 09 , 2024 | 11:45 PM

ఏ సమస్య వచ్చినా సానుకూల దృక్పఽథంతో ముందుకు సాగితే పరిష్కారం దొరుకుతుందని అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న సూచించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో హీమోఫీలియా బాధితులతో అవగాహన సదస్సు నిర్వహించారు.

అవగాహన సదస్సులో పాల్గొన్న అసిస్టెంట్‌ కలెక్టర్‌

అసిస్టెంట్‌ కలెక్టర్‌ బొల్లినేని వినూత్న

అనంతపురం టౌన, జూన 9: ఏ సమస్య వచ్చినా సానుకూల దృక్పఽథంతో ముందుకు సాగితే పరిష్కారం దొరుకుతుందని అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న సూచించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో హీమోఫీలియా బాధితులతో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్‌ కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితులు, కుటుంబసభ్యులు వారు పడుతున్న కష్ఠాలను ఆమెకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హీమోఫీలియా బాధితుల బాధలు ఆవేదనను కలిగిస్తున్నాయన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అందిస్తున్న సేవలు సులభంగా, త్వరితగతిన అందించేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు. కొన్ని కఠినమైన సమస్యలు వస్తుంటాయని వాటికి భయపడడం కన్నా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితే ఏదో ఒకరోజు మంచి ఫలితం లభిస్తుందన్నారు. జిల్లా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో హీమోఫీలియా బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలత, ఇంటాస్‌ ఫౌండేషన ప్రతినిధులు వాసుదేవరావు, రామకృష్ణ, శ్యాంసుందర్‌, కృష్ణమూర్తితోపాటు పలువురు పాల్గొన్నారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 11:45 PM

Advertising
Advertising