ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెమ్మసాని చొరవతో రైళ్ల పునరుద్ధరణ

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:31 PM

రైలు ప్రయాణికుల ఇక్కట్లను గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఒక్క లేఖతో పరిష్కరించారు.

గుంటూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): రైలు ప్రయాణికుల ఇక్కట్లను గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఒక్క లేఖతో పరిష్కరించారు. గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు మీదుగా ప్రయాణించే రెండు రైళ్ల రాకపోకల రద్దును రైల్వే అధికారులతో మాట్లాడి తక్షణమే రైళ్లు అందుబాటులోకి వచ్చేలా చేశారు. నూతన రైల్వే లైను నిర్మాణం, రైల్వే సిగ్నలింగ్‌ ఆధునికీకరణ నేపథ్యంలో 25 ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను రద్దు చేస్తున్నట్లుగా రైల్వేశాఖ ఇటీవల ప్రకటించింది. అందులో భాగంగా గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు మీదుగా రాకపోకలు సాగించే రెండు రైళ్ళను కూడా దక్షిణమధ్య రైల్వే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దాంతో ఒంగోలు-బాపట్ల-తెనాలి మీదుగా విజయవాడకు నిత్యం ప్రయాణించే కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికుల ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌కు కేంద్ర సహాయమంత్రి సోమవారం లేఖ రాశారు. డాక్టర్‌ పెమ్మసాని జోక్యంతో అరుణ్‌కుమార్‌ జైన్‌ తక్షణమే స్పందించి విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ మార్గం గుండా ప్రయాణించే 12734, 12733 రైళ్ళను పునరుద్ధరిస్తూ సోమవారం సాయంత్రానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల ఇక్కట్లపై స్పందించిన కేంద్ర సహాయమంత్రి డాక్టర్‌ పెమ్మసానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:31 PM

Advertising
Advertising
<