ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తెనాలికీ.. ఓ మేనిఫెస్టో

ABN, Publish Date - May 12 , 2024 | 01:31 AM

నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం, ప్రజల ఆక్షాంక్షల మేరకు ప్రత్యేకంగా తెనాలికి ఒక మేనిఫెస్టోను రూపొందించుకున్నామని,

పది అంశాలతో కూడిన మ్యానిఫెస్టో

- పది అంశాలతో విడుదల చేసిన మనోహర్‌

- సూపర్‌ సిక్స్‌, షణ్ముఖ వ్యూహాలతోపాటే ఇదికూడా అమలు

తెనాలి, మే 11(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం, ప్రజల ఆక్షాంక్షల మేరకు ప్రత్యేకంగా తెనాలికి ఒక మేనిఫెస్టోను రూపొందించుకున్నామని, మా కూటమి అభ్యర్థులకు సూపర్‌ సిక్స్‌, షణ్ముఖ వ్యూహాలు ఎంత ముఖ్యమో! తెనాలికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మేనిఫెస్టో కూడా అంతే ముఖ్యమని, నేను గెలిచాక దీనిని తప్పకుండా అమలు జరిపి తీరుతానని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని అంశాలతో కాకుండా ప్రత్యేకంగా కృష్ణా తీర గ్రామాలకు మేలు జరిగేలా కృష్ణా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణం కీలక అంశంగా తీసుకుని, దాని ఏర్పాటుకు ప్రత్యేక హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెనాలిని ప్రత్యేక శ్రద్దతో మిగిలిన పట్టణాలు, నగరాలకు ధీటుగా తీర్చిదిద్దుతామని, దీనికోసమే ప్రత్యేక మ్యానిఫెస్టోను రూపొందించుకున్నట్టు వివరించారు. సమావేశంలో పది అంశాలతో కూడిన తెనాలి మేనిఫెస్టోను మనోహర్‌ కూటమి పార్టీల నాయకులతో కలసి విడుదల చేశారు. మ్యానిఫెస్టోలో ప్రధాన అంశాలయితే ఇవికాక మరో ముఖ్యమైన హామీ కొల్లిపర మండల ప్రజలకు కృష్ణా నదిపై చెక్‌డ్యామ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - May 12 , 2024 | 01:31 AM

Advertising
Advertising