ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అభివృద్ధికై టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుందాం

ABN, Publish Date - May 12 , 2024 | 12:43 AM

దేశ భవిష్యతను నిర్ధారించే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని జిల్లా అభివృద్దికై టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ పిలుపునిచ్చారు.

గుంటూరు, మే 11 : దేశ భవిష్యతను నిర్ధారించే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని జిల్లా అభివృద్దికై టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ పిలుపునిచ్చారు. ఈమేరకు బ్రాడీపేటలోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా నసీర్‌ అహ్మద్‌, గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా గళ్లా మాధవిలను, గుంటూరు పార్లమెంటు పరిధిలోని శాసనసభ అభ్యర్థులందరికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి ధర్మాన్ని గెలిపించాలని కోరారు. ఈ జగనాసుర పాలనను ఓటు అనే ఆయుధం ద్వారా అంతమొందించాల్సిందిగా శ్రీధర్‌ కోరారు. గుంటూరు నగరంలో ఉన్న ఈ ముగ్గురు అభ్యర్థులు స్థానికులని, వైసీపీ అభ్యర్థిని విడదల రజని స్థానికేతరాలు అని, ఆమె ఈ నగరానికి సంబంధం లేని వ్యక్తి అని తెలియజేశారు. స్థానికులతోనే నగర అభివృద్ధి సాధ్యపడుతుందని, అలానే ఓటింగ్‌ రోజున అపార్టుమెంట్‌ వాసులు, ధనవంతుల కుటుంబాలు, వ్యాపారవర్గాల వారు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పడబోతున్న ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్‌ పిలుపునిచ్చారు.

Updated Date - May 12 , 2024 | 12:43 AM

Advertising
Advertising