ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: జగన్ రెడ్డి అర్జునుడు కాదు.. భస్మాసురుడు.. అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్

ABN, Publish Date - Feb 03 , 2024 | 06:36 PM

సీఎం జగన్ రెడ్డి(CM JAGAN)కు ఓటమి భయంతోనే అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) అన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీ ఫ్యాను రెక్కలు విరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు.

అమరావతి: సీఎం జగన్ రెడ్డి(CM JAGAN)కు ఓటమి భయంతోనే అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీ ఫ్యాను రెక్కలు విరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక సునామీలో జగన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ఓటు అనే ఆయుధంతో జగన్ రెడ్డికి ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమన్నారు. దెందులూరు సభలో జగన్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని విమర్శించారు. 57 నెలల్లో ఏపీని జగన్ సర్వనాశనం చేసి తమపై నిందలా? అని ప్రశ్నించారు.

పన్నులు, ధరలు, ఛార్జీల పెంపుతో ప్రతి కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపిన పేదల ద్రోహి జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. అబద్ధాల పునాదుల మీద పాలన చేస్తున్న జగన్ రెడ్డి అర్జునుడు కాదు...భస్మాసురుడు అని ఆరోపించారు. యుద్ధానికి ముందే ఓటమి ఒప్పుకున్న పిరికిపంద జగన్ రెడ్డి అని దెప్పిపొడిశారు. బాబాయ్‌(వివేకా)ను చంపి, తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డి మహిళా పక్షపాతినా? అని నిలదీశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజా రాజధాని అమరావతిని చంపేశాడని మండిపడ్డారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేశారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓటమి ఖాయమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - Feb 03 , 2024 | 06:36 PM

Advertising
Advertising