ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాపుల సంక్షేమాన్ని విస్మరించిన జగన ప్రభుత్వం

ABN, Publish Date - May 11 , 2024 | 01:09 AM

సీఎం జగన తన ఐదేళ్ల పాలనలో కాపుల సంక్షే మాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని మంగళగిరి నియోజకవర్గ కాపు నాయకులు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కాపు నాయకులు

మంగళగిరి సిటీ, మే 10: సీఎం జగన తన ఐదేళ్ల పాలనలో కాపుల సంక్షే మాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని మంగళగిరి నియోజకవర్గ కాపు నాయకులు పేర్కొన్నారు. మండలంలోని ఎర్రబాలెంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాపు సంఘాల నేతలు గోవాడ దుర్గారావు, విన్నకోట శ్రీనివాస రావు, తిరుమలశెట్టి కొండలరావు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొ రేషనను నిర్వీర్యం చేసిందన్నారు. కాపులకు ఈబీసీ కోటాలో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన 5శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా జగన తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. కాపులను సామాజికంగాను, ఆర్థికంగాను బలహీన పరచాలన్న దురుద్దేశంతోనే రిజర్వేషన్లను అమలు చేయలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం కాపులకు ప్రత్యేక కార్పొరేషన ఏర్పాటు చేసి 2014-19 మధ్య కాలం లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. జగన ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.పది వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. జగన మోసాలపై కాపులంతా అప్రమత్తంగా ఉండి, ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్ని కల్లో మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేశ, గుం టూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌లను గెలిపించాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో కాపు సంఘాల నేతలు కాపరౌతు సుందర య్య, బాణాల నాగేశ్వరరావు, ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2024 | 01:09 AM

Advertising
Advertising