ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటమి భయంతో అప్పిరెడ్డికి మతిభ్రమించింది

ABN, Publish Date - May 19 , 2024 | 12:45 AM

ఓటమి భయం తోనే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మతి భ్రమించి మాట్లా డుతున్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు, మే 18(ఆంధ్రజ్యోతి): ఓటమి భయం తోనే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మతి భ్రమించి మాట్లా డుతున్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీ పీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన అల్లర్ల వెనుక చంద్రబాబు, పురంధే శ్వరిల హస్తముందని అప్పిరెడ్డి మాట్లాడటం సిగ్గుచే టన్నారు. ప్రజలు ఎక్కడికక్కడ వైసీపీ అభ్యర్థులను, నేతలను చెప్పు దెబ్బలు, చెంపదెబ్బలతో శివకుమార్‌, మద్దాళి గిరిని వెంటబడి తరిమి కొట్టారని అన్నారు. వైసీపీ అవినీతి, అరాచకాలు భరించలేక రాష్ట్ర వ్యాపితంగా ఉద్యోగులతోపాటు పోలీసులు కూడా 80 శాతానికి పైగా టీడీపీ కూటమికి ఓటేశామని బహిరంగం గానే చెపుతున్నారని అన్నారు. జగన అవినీతి, అరాచకాలకు ఎంతోమంది ఐఏ ఎస్‌, ఐపీఎస్‌ అధికారులు జైలు పాలైన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వైఎస్‌ మరణానికి అంబానీ కారణమని ఆరోపిస్తూ గుంటూరు నగరంలో లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరగలేదా అని నిలదీశారు. వ్యక్తులను, వ్యవస్థ లను మేనేజ్‌ చేయటంలో జగన బహుముఖ ప్రజ్ఞాశాలన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తీవ్రమైన ఆర్ధిక నేరాలకు పాల్పడి, ఎటువంటి విచారణ లేకుండా, 2,700 వాయిదాలు ఎగ్గొట్టి, బెయిల్‌పై పన్నెండు సంవత్సరాల నుంచి బయట ఉంటూ చరిత్ర సృష్టించిన ఏకైక నిందితుడు జగన రెడ్డి కదా అని ప్రశ్నించారు. సొంత బాబాయిని తమ్ముళ్ల చేత హత్య చేయించటమేకాక, సీబీఐ ని కూడా అడ్డుకుని వెనక్కి పంపగలగిన మాఫియా డాన జగన రెడ్డి అని ధ్వజ మెత్తారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీపై తప్పుడు కేసులు పెట్టించింది మీరుకదా అని ప్రశ్నించారు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై దాడులు చేసినవారు, చేయించినవారు ఊహకందని మూల్యం చెల్లించుకోక తప్పదని కనపర్తి హెచ్చరించారు.

Updated Date - May 19 , 2024 | 12:45 AM

Advertising
Advertising