నా విజయం.. ప్రజలు ప్రసాదించిన వరం
ABN, Publish Date - Jun 23 , 2024 | 12:52 AM
‘అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మధుర క్షణాలను మాటలలో వర్ణించలేను. గొప్ప అనుభూతిని పొందా..
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి
రెంటచింతల,జూన్ 22 : ‘అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మధుర క్షణాలను మాటలలో వర్ణించలేను. గొప్ప అనుభూతిని పొందా.. నియోజకవర్గ ప్రజలు నాకు ప్రసాదించిన వరంగా భావిస్తున్నా. అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటా’ నని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం రెంటచింతలకు చెందిన నేతలు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని గుంటూరులోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారితో హ్ర్మారెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. అందుకోసం అవిరళంగా శ్రమిస్తానని, వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకుంటూ అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని, ఇరిగేషన్‌ను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పేదల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. క్రమంతప్పకుడా అసెంబ్లీ సమావేశాలకు హాజరై, నియోజక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని కలిసిన వారిలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు సుమంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, రామకృష్ణ, శౌర్రెడ్డి, రాయపరెడ్డి, తదితరులు ఉన్నారు.
Updated Date - Jun 23 , 2024 | 12:52 AM