ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కామాంధుడికి జీవిత ఖైదు, 21 వేల జరిమానా

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:39 PM

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేసినట్టు నేరం రుజువు కావడంతో నల్గొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి గ్రామంలోని సరికల తండాకు చెందిన కేతావత్‌ బాలునాయక్‌కి జీవిత ఖైదు రూ.21వేల జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి కె.నీలిమ సోమవారం తీర్పు చెప్పారు.

గుంటూరు(లీగల్‌), జూలై 15: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేసినట్టు నేరం రుజువు కావడంతో నల్గొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి గ్రామంలోని సరికల తండాకు చెందిన కేతావత్‌ బాలునాయక్‌కి జీవిత ఖైదు రూ.21వేల జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి కె.నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె శ్యామల ప్రాసిక్యూషన్‌ తరపున సాక్షులను ప్రవేశపెట్టి వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం నిందితుడు బాలునాయక్‌ గొర్రెల కాపరి. ఇతడు గొర్రెలు కాసేందుకు తరచూ మాచర్ల మండలంలోని కొత్తూరు గ్రామానికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతనికి కొత్తూరు గ్రామంలోని ఆ చిన్నారి తండ్రితో పరిచయం ఏర్పడింది. 2018 మార్చి 22న ఉదయం 10 గంటలకు నిందితుడు బాలునాయక్‌ కొత్తూరు వచ్చి ఆ చిన్నారి తండ్రితో కలిసి కల్లు దుకాణానికి వెళ్లి మద్యం ేసవించాడు. ఇద్దరూ కలిసి చిన్నారి ఇంటికి వచ్చాడు. అక్కడ బాలునాయక్‌ ఆ చిన్నారి గురించి ఆమె తండ్రిని అడగగా అంగన్వాడీ స్కూలుకు వెళ్లిందని చెప్పాడు. దాంతో బాలునాయక్‌ స్కూలుకు దగ్గరలో ఆ చిన్నారి ఆడుకుంటున్న ప్రదేశానికి వెళ్లి బిస్కెట్లు కొనిపెడతానని చెప్పి గ్రామంలోని రైస్‌మిల్లు వెనుక ఉన్న గడ్డివాము వద్దకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడటమే కాక హత్య చేసి పరారయ్యాడు. ఈ సంఘటనపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగార్జునసాగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీ సిట్‌ అడిషనల్‌ ఎస్పీ కేజీవీ సరిత దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం బాలునాయక్‌పై పలు సెక్షన్ల కింద నేరం రుజువుకావడంతో అతనికి జీవిత ఖైదు, రూ.21వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Updated Date - Jul 15 , 2024 | 11:39 PM

Advertising
Advertising
<