అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన లక్ష్యాలను సాధించండి
ABN, Publish Date - May 26 , 2024 | 12:58 AM
అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన 6 లక్షల మంది వయోజనులకు టీకాలు ఇవ్వాలనే లక్ష్యాన్ని సాధించేందుకు టీబీ నియంత్రణ కార్యాలయ సిబ్బంది చిత్తశుద్దితో కృషి చేయాల ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కే.విజయలక్ష్మి కోరారు.
గుంటూరు (మెడికల్), మే 25 : అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన 6 లక్షల మంది వయోజనులకు టీకాలు ఇవ్వాలనే లక్ష్యాన్ని సాధించేందుకు టీబీ నియంత్రణ కార్యాలయ సిబ్బంది చిత్తశుద్దితో కృషి చేయాల ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కే.విజయలక్ష్మి కోరారు. శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం మీటింగ్ హాల్‌లో ఎస్‌టీఎస్, ఎస్‌టీఎల్‌ఎస్, టీబీ హె చవీ వంటి క్షయ నియంత్రణ కార్యాలయ సిబ్బందికి అడల్ట్ బీసీజీ వ్యాక్సి నేషనపై నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ టీకాల కార్యక్ర మంలో జిల్లా లక్ష్య సాధనలో బాగా వెనుకబడినట్లు ఆమె వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని టీబీ నియంత్రణ సిబ్బంది, సమీపంలో ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్‌హెచపీల సహకారం తీసుకొని బీసీజీ వ్యాక్సినేషన లక్ష్యాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు, డీఐవో డాక్టర్ కేవీ సుబ్బరాజు, ఎనసీడీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రావణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2024 | 12:58 AM