ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN, Publish Date - May 17 , 2024 | 12:05 AM
సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి రిటర్నింగ్ అధికారులకు సూచించారు.
గుంటూరు సిటీ, మే 16: సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఓట్లు లెక్కింపు ఏర్పాట్లనకు సంబంధించి గురువారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య నాగర్జున యూనివర్సిటీలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన భవనాల్లో కౌంటింగ్‌కు సంబంధించిన టేబుళ్ళు, బారికేడింగ్, సీసీ కెమేరాల ఏర్పాట్లతో పాటు అవసరమైన ఇతర సౌకర్యాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులు పరిశీలించి, వెంటనే పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ, ర్యాండమైజేషన్ ప్రక్రియలు సక్రమంగా నిర్వహించాలన్నారు. కౌంటింగ్ రోజు టేబుళ్లు, రౌండ్ల వారీగా వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు అందించేందుకు అవసరమైన సిబ్బందిని, కంప్యూటర్లు, ఇంటర్ నెట్ తదితర సౌకర్యాలను ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్త చేకూరి, అసిస్టెంట్ కలెక్టర్(ట్రైనీ) పవార్ స్వప్నిల్‌జగన్నాఽథ్, డీఆర్వో పెద్దిరోజా, ఆర్డీవో శ్రీఖర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీ కుమారి, జీఎంసీ ఏసీ రాజ్యలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్(ట్రైనీ) స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2024 | 12:07 AM