ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Jagan: ఆరోగ్యశ్రీపై ముమ్మరంగా ప్రచారం చేయాలి

ABN, Publish Date - Jan 12 , 2024 | 07:29 PM

ఆరోగ్యశ్రీ ( Aarogyasri ) వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) ఆదేశించారు. శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

అమరావతి: ఆరోగ్యశ్రీ ( Aarogyasri ) వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) ఆదేశించారు. శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. నిర్ణీత గడువులోగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ.25 లక్షల వరకూ వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలని చెప్పారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి క్యాంపుల ద్వారా అవసరమైన వారికి వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రతి 6 నెలలకోసారి రికార్డులు అప్డేట్‌ చేయాలన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంప్‌లపై సీరియస్‌‌గా దృష్టిపెట్టాలన్నారు. ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని డ్రైవ్‌ చేయాలని సూచించారు. నూతన మెడికల్‌ కాలేజీల్లో అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

Updated Date - Jan 12 , 2024 | 08:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising