ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని..

ABN, Publish Date - Mar 03 , 2024 | 10:45 AM

అమరావతి: మూడు రాజధానులంటూ సీఎం జగన్ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి... చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారంటూ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి: మూడు రాజధానులంటూ సీఎం జగన్ (CM Jagan) మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి... చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని (Amaravati) రాష్ట్ర సచివాలయాన్ని (Secretariat) కూడా తాకట్టు పెట్టేశారంటూ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని.... తెలుగు ప్రజల ఆత్మగౌరవమని.. రాష్ట్రానికి ఎంత అవమానకరం ... ఎంత బాధాకరం... ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? అంటూ మండిపడ్డారు. రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ (Brand of Andhra Pradesh)ని జగన్ నాశనం చేశారని.. ప్రజలారా... అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

కాగా రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.86 లక్షల కోట్లు. కానీ, కేవలం రూ.370 కోట్ల కోసం నవ్యాంధ్ర ఆత్మ గౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదిక అయిన సచివాలయాన్ని తాకట్టు పెట్టడం జగన్‌ సర్కారు దా‘రుణ’ దాహానికి నిదర్శనం. సచివాలయంలో ఐదు బ్లాకులు (భవంతులు) ఉన్నాయి. శాసన సభ, శాసనమండలి భవనాలు విడిగా ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని ఐదు బ్లాకులు తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. అప్పు కోసం తొలుత ఐసీఐసీఐ బ్యాంకును ఆశ్రయించినట్లు సమాచారం. ‘కుదరదు’ అని ఐసీఐసీఐ తేల్చడంతో, హెచ్‌డీఎఫ్‌సీకు వెళ్లారు. ‘ఊరికే కాగితాలు చూపిస్తే సరిపోదు. సచివాలయ భవనాలను తాకట్టు రిజిస్ట్రేషన్‌ చేసిస్తే... మొత్తం నిర్మాణ వ్యయంలో సగం అప్పుగా ఇస్తాం’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో... గుట్టుచప్పుడు కాకుండా సచివాలయ భవనాలను హెచ్‌డీఎఫ్‌సీకి తాకట్టు రిజిస్ట్రేషన్‌ చేసిచ్చేశారు.

త్వరలో ఆ భవనాలూ...

జగన్‌ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించిన సంగతి తెలిసిందే. చివరికి... 90 శాతం పూర్తయిన అఖిలభారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల భవన సముదాయాలను కూడా గాలికి వదిలేశారు. కానీ... ఇటీవల ఆ భవనాల్లో అధికారాలు నివసిస్తున్నారని, సీఆర్డీయేకు రూ.70 కోట్లు అద్దె కూడా చెల్లించామంటూ జీవో విడుదల చేశారు. నిర్మాణం పూర్తికాని భవనాల్లో నివాసం ఉండటమేంటి... దానికి అద్దె చెల్లించడమేమిటనే అనుమానాలు అప్పట్లోనే తలెత్తాయి. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోతే తీసుకున్న అప్పు మొత్తం తిరిగి చెల్లించాలనే షరతుతో రుణం సేకరించి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. మొత్తం అప్పు కట్టలేక, అవి పూర్తయినట్లుగా తప్పుడు జీవోలు సృష్టించారని అప్పుడు భావించారు. కానీ, ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ భవనాలను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చేందుకే ‘అద్దె’ నాటకం ఆడినట్లు తెలుస్తోంది. సచివాలయ భవనాల తాకట్టు అనంతరమే... అధికారుల భవన సముదాయాలనూ తాకట్టు పెట్టి అప్పు తెచ్చే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం.

Updated Date - Mar 03 , 2024 | 10:45 AM

Advertising
Advertising