ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పూర్తిగా దెబ్బతిన్న భవన నిర్మాణరంగం

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:17 AM

గుంటూరులో భవన నిర్మాణరంగం పూర్తిగా దెబ్బతిని పోయిందని, అందుకు ప్రధాన కారణం గుంటూరు మున్సిపల్‌ శాఖ అధికారులు అని నరేడ్కో, క్రెడాయ్‌ నాయకులు ఆరోపించారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న నరేడ్కో, క్రెడాయ్‌ నాయకులు

గుంటూరు(కార్పొరేషన్‌), జూన్‌ 11: గుంటూరులో భవన నిర్మాణరంగం పూర్తిగా దెబ్బతిని పోయిందని, అందుకు ప్రధాన కారణం గుంటూరు మున్సిపల్‌ శాఖ అధికారులు అని నరేడ్కో, క్రెడాయ్‌ నాయకులు ఆరోపించారు. మంగళవారం గుంటూరు నగరంలో ఓ హోటల్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెండు అసోసియేషన్ల నాయకులు మాట్లాడుతూ గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలో ఆరు నెలలు గడిచినీ బిల్లింగ్‌ అనుమతులు రావటం లేదన్నారు. పూర్తయిన భవనానికి ఓసీ రిలీజ్‌ చేయడంలో నెలలు తరబడి ఎదురు చూడాలని పరిస్థితి నెలకొందని నాయకులు ఆవేదన చెందారు. ఓసీ రిలీజ్‌, మార్ట్‌గేజ్‌ రద్దుకు అధికారులు భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు అని అన్నారు. గుంటూరు నగరంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అవినీతి, అక్రమాలు భారీగా పెరిగిపోయాయి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా కొత్త నిబంధనలను గుంటూరు కార్పొరేషన్‌లోని అమలు చేస్తున్నారని, దీనిపై టౌన్‌ప్లానింగ్‌ శాఖ డైరెక్టర్‌ విద్యుల్లత చెప్పినప్పటికీ ఇక్కడ అమలు కావటం లేదన్నారు. కమిషనర్‌ కీర్తి చేకూరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. భవన నిర్మాణానికి 15 రోజుల్లోగా అనుమతులు ఇవ్వాల్సి ఉండగా సంవత్సరమైనా కూడా అనుమతులు రావడం లేదన్నారు. గత ప్రభుత్వంలో పూర్తిగా నిబంధన ఉల్లంఘించారని, బిల్డర్లను బాగా ఇబ్బంది పెట్టారన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో ఓసి ఇచ్చిన రోజే మార్ట్‌గేజ్‌ రిలీజ్‌ చేస్తున్నారని అన్నారు. నిర్మాణరంగం వల్ల నగరానికి 20 నుంచి 25 శాతం ఆదాయం లభిస్తుందని, కీలకమైన నిర్మాణ రంగాన్ని కార్పొరేషన్‌ అధికారులు పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. వీటిపై న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టులో ప్రత్యేక పిల్‌ వేనున్నట్లు తెలిపారు. సమావేశంలో నరేడ్కో అధ్యక్షులు పి.నాగవంశీ, ఉపాధ్యక్షులు యాగంటి దుర్గాప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి ఎం.సీతారామయ్య, సభ్యులు ఈవీ మల్లికార్జునరావు, డి.శ్రీనివాసరావు క్రెడాయ్‌ గుంటూరు చాప్టర్‌ అధ్యక్షులు మామిడి రాము, సతీష్‌రెడ్డి, దాసరి నాగశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:17 AM

Advertising
Advertising