ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN, Publish Date - May 26 , 2024 | 01:02 AM

దివ్యాంగ బాలబాలికల వసతిగృహాలలో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రకాష్‌నగర్‌, నరసరావుపేట, చల్లగుండ్ల, నకరికల్లు మండలం, పల్నాడు జిల్లాలో ఉచితప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నరసరావుపేట వార్డెన్‌ (గ్రేడ్‌-1) ఎస్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు.

నరసరావుపేట రూరల్‌, మే 25: దివ్యాంగ బాలబాలికల వసతిగృహాలలో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రకాష్‌నగర్‌, నరసరావుపేట, చల్లగుండ్ల, నకరికల్లు మండలం, పల్నాడు జిల్లాలో ఉచితప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నరసరావుపేట వార్డెన్‌ (గ్రేడ్‌-1) ఎస్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులైన అనగా శారీరక, దృష్టి లోపం కలిగి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి 1వ తరగతిలో ప్రవేశం పొందినవారు వారి వసతికై వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా 10వ తరగతి వరకు వారి చదువు కొనసాగించుకోవచ్చు. ఈ వసతిగృహంలో విద్యార్థులకు దుస్తులు, భోజనం, వసతి, నోట్‌బక్‌స, టెడ్డింగ్‌ మెటీరియల్‌, కాస్మటిక్స్‌ ఖర్చులు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు (బాలబాలికలు) శారీరక అంగవైకల్యం, పాక్షిక అంధత్వ లోపం కలిగి ప్రభుత్వ వైద్యశాల నుండి ధ్రువీకరణపత్రం పొందిన బాలబాలికలు ఈ సదుపాయన్ని వినియోగించుకోవచ్చు. వివరాలకు ఎస్‌.సతీష్‌కుమార్‌, వార్డెన్‌ గ్రేడ్‌-1, ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల, అంధుల వసతి గృహం, నరసరావుపేట, ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలబాలికల వసతిగృహం, చల్లగుండ్ల, నకరికల్లు మండలం వారి ఫోన్‌ నెంబర్‌: 98493 47904లో సంప్రదించాలని తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 01:02 AM

Advertising
Advertising