TDP: చంద్రబాబుతో ముగిసిన ఆలపాటి రాజా భేటీ.. ఏం చర్చించారంటే..?
ABN, Publish Date - Feb 25 , 2024 | 03:19 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన(TDP- JANASENA) కూటమి జెట్ స్పీడులో దూస్తుకెళ్తున్నాయి. ఈ రెండు పార్టీల వ్యూహంలో భాగంగా శనివారం నాడు తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ(TDP) నుంచి టికెట్ దక్కని నేతలను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బుజ్జగిస్తున్నారు.
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన(TDP- JANASENA) కూటమి జెట్ స్పీడులో దూస్తుకెళ్తున్నాయి. ఈ రెండు పార్టీల వ్యూహంలో భాగంగా శనివారం నాడు తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ(TDP) నుంచి టికెట్ దక్కని నేతలను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బుజ్జగిస్తున్నారు. తెనాలి నుంచి టీడీపీ టికెట్‌ను ఆలపాటి రాజా(Alapati Raja) ఆశించారు.
అయితే ఆయనకు టికెట్ దక్కకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు. ఆయనను బుజ్జగించేందుకు ఉండవల్లిలోని తన నివాసానికి ఈరోజు(ఆదివారం) రావాలని చంద్రబాబు పిలిపించారు. దాంతో ఆలపాటి రాజా చంద్రబాబు నివాసానికి వచ్చారు. సుమారు రెండు గంటల పాటు అధినేతతో రాజా చర్చించారు. చంద్రబాబుతో భేటీ అత్యంత సంతృప్తికరంగా ముగిసిందని రాజా తెలిపారు. పొత్తుల్లో భాగంగానే తెనాలి సీటు జనసేనకు కేటాయించాల్సి వచ్చిందని వివరించారు. పొత్తుల్లో తన సీటును జనసేనకు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని చంద్రబాబు తనతో చెప్పారని అన్నారు. నాదెండ్ల మనోహర్‌తో సమన్వయం చేసుకుని రాబోయే ఎన్నికల్లో ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారని ఆలపాటి రాజా తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 25 , 2024 | 03:27 PM