తోడుగా నిలిచిన స్నేహితులు
ABN, Publish Date - Jun 01 , 2024 | 11:59 PM
తమతోపాటు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహి తుడు అనారోగ్యంతో బాధ పడుతుంటే సాటి మిత్రులు తోడుగా నిలిచారు.
మిత్రుడికి ఆర్థిక సాయం అందజేస్తున్న పూర్వ విద్యార్థులు
కోసిగి, జూన్ 1: తమతోపాటు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహి తుడు అనారోగ్యంతో బాధ పడుతుంటే సాటి మిత్రులు తోడుగా నిలిచారు. 2002-03 పదవ తరగతి పూర్వ విద్యార్థుల్లో ఒకరైన డి.బెళగల్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు కురువ ఉరుకుందు వారం రోజులక్రితం హైబీపీకి గురై కాలు, చేతులు పడిపోయాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడని తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు రామక్రిష్ణ, చిదానంద, రామాంజనేయులు, దినేష్, హనుమంతు, ఉశేన్‌బాషా కర్నూలు వెళ్లి మిత్రుడు ఉరుకుందు ఆరోగ్య ఖర్చులకు రూ.30వేలు అందించారు.
Updated Date - Jun 01 , 2024 | 11:59 PM