ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుటుంబంలో ‘వరద’ విషాదం

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:23 AM

వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తున్నాయి. కొండల మీద నుంచి వచ్చిపడుతున్న వరద, విరిగిపడుతున్న కొండచరియలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో బీభత్సం సృష్టించాయి. వరద ప్రవాహంలో ఓ కుటుంబం కొట్టుకుపోయింది.

మహిళ మృత్యువాత..ముగ్గురికి తీవ్ర గాయాలు.. నిద్రిస్తుండగా ముంచెత్తిన వరద.. చట్రాపల్లిలో కొండచరియల బీభత్సం

గూడెంకొత్తవీధి (అల్లూరి సీతారామరాజు జిల్లా), సెప్టెంబరు 9: వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తున్నాయి. కొండల మీద నుంచి వచ్చిపడుతున్న వరద, విరిగిపడుతున్న కొండచరియలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో బీభత్సం సృష్టించాయి. వరద ప్రవాహంలో ఓ కుటుంబం కొట్టుకుపోయింది. ఆ కుటుంబంలోని ఓ మహిళ ఆ తర్వాత విగత జీవి అయి కనిపించగా, మిగతా ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక అంతా నిద్రలో ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మృతురాలిని గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామానికి చెందిన కొర్రా కుమారి(20)గా గుర్తించారు. కొండ దిగువన ఉన్న చట్రాపల్లి గ్రామంలో అర్ధరాత్రి తరువాత వర్షం ఉధృతి పెరిగింది. ఆ సమయంలో గ్రామ సమీపంలోని కొండ పైనుంచి వరద ప్రవాహంతో కొండచరియలు కొట్టుకువచ్చాయి. ఈ వరదలో వృద్ధుడు కొర్ర పండన్న, కుమారుడు కొర్ర సుబ్బారావు, కుమార్తె కొర్ర కుమారి (20), మరో కుమార్తె కొర్ర సుమిత్ర వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొర్ర కుమారి మృతదేహం గ్రామానికి కిలోమీటరు దూరంలో లభ్యమైంది. పండన్న, సుబ్బారావు, సుమిత్ర గ్రామానికి 400 నుంచి 600 మీటర్ల దూరంలో తుప్పల్లో చిక్కుకున్నారు. సహాయం కోసం వారు వేసిన కేకలు విని గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు కొంతదూరం వరకు మోసుకువచ్చి, అక్కడ నుంచి అంబులెన్సులో సప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాలు విరిగిపోయిన సుమిత్రకు పీహెచ్‌సీలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా, చట్రాపల్లి గ్రామంలో కొండచరియలు, వరద నీటి ప్రవాహానికి పదులసంఖ్యలో మేకలు, గొర్రెలు, పశువులు కొట్టుకుపోయి మృత్యువాతపడ్డాయి. ఈ గ్రామంలో పండన్న గృహంతో పాటు మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

Updated Date - Sep 10 , 2024 | 03:24 AM

Advertising
Advertising