ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎట్టకేలకు కరువు నిధుల విడుదల

ABN, Publish Date - May 17 , 2024 | 03:30 AM

గతేడాది ఖరీ్‌ఫలో వచ్చిన కరువు, మిచౌంగ్‌ తుఫాన్‌కు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులకు ప్రభుత్వం ఎట్టకేలకు పరిపాలన ఆమోదం తెలిపింది. 2023 ఖరీ్‌ఫలో కరువు బారినపడిన

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): గతేడాది ఖరీ్‌ఫలో వచ్చిన కరువు, మిచౌంగ్‌ తుఫాన్‌కు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులకు ప్రభుత్వం ఎట్టకేలకు పరిపాలన ఆమోదం తెలిపింది. 2023 ఖరీ్‌ఫలో కరువు బారినపడిన రైతులకు, గత డిసెంబరులో మిచౌంగ్‌ తుఫాన్‌కు పంట నష్టపోయిన రైతులకు రూ.1,289 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులకు ఈ ఏడాది మార్చి 6న సీఎం జగన్‌ బటన్‌ నొక్కారు. కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాలకు సొమ్ము జమ కాలేదు. పోలింగ్‌కు ముందు జమ చేసి, రైతులను ఆకట్టుకోవటానికి జగన్‌ సర్కార్‌ చేసిన ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. పోలింగ్‌ పూర్తయ్యే వరకు చెల్లింపులు వాయిదా వేయాలని చెప్పింది. దీంతో గత్యంతరం లేక కరువు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.847కోట్ల చెల్లింపులకు పరిపాలన ఆమోదం, బడ్జెట్‌ విడుదలకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరువు నిధులు రైతుల ఖాతాలకు జమ చేయడానికి ఆర్థిక శాఖ నిఽధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ మరో మూడు రోజులు పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మిచౌంగ్‌ తుఫాన్‌ నష్టానికి ఇన్‌పుట్‌ నిధుల విడుదలకు ఇంకా పరిపాలన ఆమోదం ఇవ్వలేదు.

Updated Date - May 17 , 2024 | 08:10 AM

Advertising
Advertising