ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రానికి జ్వరం!

ABN, Publish Date - Aug 18 , 2024 | 04:21 AM

అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. అది కూడా 100 నుంచి 101 డిగ్రీల పైనే టెంపరేచర్‌ ఉంటుంది. దీనికితోడు తీవ్రమైన ఒళ్లు నొప్పులు, మంచం మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి.

వింత వైరస్‌తో ఇబ్బందులు

రక్త పరీక్షలోనూ తేలని కారణం

బాధితుల్లో చిత్రమైన లక్షణాలు

100 నుంచి 101 డిగ్రీలపైనే జ్వరం

తీవ్రమైన ఒళ్లు నొప్పులు, వాంతులు

కొంత మందిలో ప్లేట్‌లెట్స్‌ డౌన్‌

వైద్యులకూ అంతుచిక్కని జ్వరాలు

రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు

పొరుగు రాష్ట్రాలకు బాధితుల పయనం

అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. అది కూడా 100 నుంచి 101 డిగ్రీల పైనే టెంపరేచర్‌ ఉంటుంది. దీనికితోడు తీవ్రమైన ఒళ్లు నొప్పులు, మంచం మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి. కొంత మందికి వాంతులు.. మరికొంత మందికి జలుబు, దగ్గు, తీవ్రమైన తలనొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలా మందికి అకస్మాత్తుగా ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోగం ఏమిటో తెలుసుకుందామని రక్తపరీక్షలు చేయించుకున్నా.. వాటిలోనూ కారణం ఏమిటో తేలడం లేదు. కొంత మందిలో డెంగీ లక్షణాలు, మరికొంత మందిలో చికెన్‌ గున్యా లక్షణాలు.. డయేరియా.. టైఫాయిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. అసలు ప్రజలకు వస్తున్న జ్వరాలు ఏమిటన్న దానిపై డాక్టర్లకు కూడా అంతుపట్టడం లేదు. కానీ, రాష్ట్రంలో జ్వరపీడితుల సంఖ్య మాత్రం రోజు రోజుకు భారీగా పెరుగుతోంది.

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ వింత వైరస్‌ విజృంభించడంతో విచిత్ర లక్షణాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారు. వింత రోగాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రయివేటు ఆస్పత్రులు కూడా వైర్‌సను గుర్తించలేకపోతున్నాయి. వింత రోగాల వల్ల ప్రాణాపాయ పరిస్థితి లేదు కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రమాదంలోకి నెడుతోందని వైద్యులు చెబుతున్నారు. అసలు ఇది ఏ వైరస్‌? ఈ లక్షణాలు ఏ వైర్‌సకు సంబంధించినవి? అసలు ఈ లక్షణాలు ఎందుకు వస్తున్నాయి? అన్న దానిపై ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు దృష్టిపెట్టలేదు. రాష్ట్రంలో నానాటికీ జ్వరాలు పెరుగుతున్నా ఆరోగ్యశాఖ మంత్రి ఇప్పటికీ స్పందించక పోవడం గమనార్హం.

వైసీపీ నిర్వాకంతోనేనా?

గత ప్రభుత్వం ఆరోగ్యశాఖను, గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్నీ పూర్తిగా విస్మరించింది. ఈ కారణంగానే ఈ రోజు ఈ పరిస్థితి నెలకొందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశాఖ ముందుగానే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలి. రెండు, మూడు నెలల నుంచి రాష్ట్రంలో వింత రోగాలు అధికంగానే ఉన్నా యి. కానీ, గత ప్రభుత్వం ముందస్తు నివారణ చర్యల్లో పూర్తిగా విఫలం అయింది. అప్పుడే వింత రోగాలు, జ్వరాలపై జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉం డేది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో డయేరియా, టైఫాయిడ్‌తో ప్రారంభమైన అనారోగ్య సమస్యలు.. నేడు జ్వరాలు ప్రబలేందుకు దారితీశాయన్న వాదన వినిపిస్తోంది.

ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి

అసలు ప్రజలకు వచ్చే జ్వరం ఏమిటన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. కొంత మందికి అకస్మాత్తుగా జ్వరాలు వస్తున్నాయి. ఆ వెంటనే తీవ్రమైన ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఈ లక్షణాలతో బాధపడుతున్న వారిలో మూడు నాలుగు రోజుల్లో రక్తంలో ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. సాధారణంగా వారం రోజుల పాటు డెంగీ తీవ్రంగా ఉంటనే ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయి. కానీ వింత జ్వరాల వల్ల విచిత్రంగా ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నా.. అసలు రోగం ఏమిటన్నది గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం.. మెడికల్‌ కాలేజీల్లో ఉన్న సీక్వెన్సీ ల్యాబ్స్‌ను ఉపయోగించి జ్వరాలు ప్రబలడానికి గల కారణాలు గుర్తించాలి. జ్వరాలకు గల కారణాలు గుర్తిస్తే, ఆ తర్వాత దానికి సంబంధించిన వైద్యం అందుబాటులోకి తీసుకురావ చ్చు. ఆరోగ్యశాఖ అధికారులు ఆదిశగా ఆలోచన చేయాలి. రాష్ట్రంలో అన్ని బోధనాసుపత్రు ల్లో ల్యాబ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో ఉపయోగించడం లేదు. దీంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) నుంచి బోధనాసుపత్రుల వరకు ప్రతి ఆస్పత్రిలో జ్వరపీడితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

సవాళ్లను అధిగమించి సంపన్న దేశంగా మార్చండి

వీఐటీ స్నాతకొత్సవంలో యువ పట్టభద్రులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

చెన్నై, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్‌ యువ పట్టభద్రులపైనే ఆధారపడి ఉందని, స్వాతంత్య్రదిన శత వార్షికోత్సవాల్లోపు దేశాన్ని సంపన్న దేశంగా మార్చే బాధ్యత యువతపైనే ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ‘వీఐటీ చెన్నై’ క్యాంప్‌సలో శనివారం ఉదయం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని సందేశమిచ్చారు. నాణ్యమైన విద్యనందించడంలో వీఐటీ విద్యాసంస్థలు ముందంజలో ఉన్నాయన్నారు. వీఐటీ వ్యవస్థాపక ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.విశ్వనాధన్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మ డి జాబితాకు మార్చేటప్పుడు తాను ఆ నిర్ణయానికి మద్దతుగా ఓటు వేశానని, ప్రస్తుతం విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించినంతమేరకు నిధులు విడుదల చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యనందిస్తుండటం వల్లే తమ సంస్థల్లో చదివిన విద్యార్థులకు 90 శాతం దాకా ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయన్నారు.

Updated Date - Aug 18 , 2024 | 08:22 AM

Advertising
Advertising
<