ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: మార్చి 14-16 మధ్య ఎన్నికల షెడ్యూల్‌!

ABN, Publish Date - Mar 10 , 2024 | 04:06 AM

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 14-16 తేదీల మధ్యన ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

లోక్‌సభతో పాటు 5 అసెంబ్లీలకూ

వచ్చే నెలాఖరులో ఏపీలో పోలింగ్‌

ముమ్మరంగా ఈసీ కసరత్తు

న్యూఢిల్లీ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 14-16 తేదీల మధ్యన ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనుంది. అక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలమనేది మూడు రోజుల పర్యటనలో అంచనా వేయనుంది. తర్వాత ఒకటి రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చని తెలిసింది. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబరు లోపు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే అక్కడ అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించగలిగే అవకాశం ఉందేమో అంచనా వేయాలని కేంద్ర ప్రభుత్వం ఈసీని కోరింది. మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏప్రిల్‌ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో పోలింగ్‌ జరిగే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే ‘కోడ్‌’ అమలులోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి

kothapaluku: 15 మంది జంప్‌.. !.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు సీఎం రేవంత్ ఓకే!!

Lok Sabha Election2024: ఈసీలో కలకలం!.. అనూహ్యంగా ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ రాజీనామా

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 07:15 AM

Advertising
Advertising