ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ చెంప మీద ఓటుతో కొట్టాలి

ABN, Publish Date - Apr 19 , 2024 | 01:25 AM

మే 13న జరుగనున్న ఎన్నికల్లో వైసీపీ చెంప మీద ఓటుతో కొట్టాలి. పిఠాపురం పవర్‌ అంటే ఇదిరా అని చూపాలి అని సినీనటుడు, జనసేన స్టార్‌ క్యాంపైనర్‌ పృథ్వీరాజ్‌ అన్నారు.

పిఠాపురం పవర్‌ అంటే ఇదిరా అని చూపాలి

లక్ష మెజార్టీతో పవన్‌ విజయం సాధిస్తారు: సినీ నటుడు పృథ్వీరాజ్‌

పిఠాపురం, ఏప్రిల్‌ 18: మే 13న జరుగనున్న ఎన్నికల్లో వైసీపీ చెంప మీద ఓటుతో కొట్టాలి. పిఠాపురం పవర్‌ అంటే ఇదిరా అని చూపాలి అని సినీనటుడు, జనసేన స్టార్‌ క్యాంపైనర్‌ పృథ్వీరాజ్‌ అన్నారు. ఇక్కడి నుంచే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. కష్టాలన్నీ అధిగమించిన పవన్‌ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని తెలిపారు. పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రంలో ఆయన గురువారం పూజలు నిర్వహించారు. అనంతరం కుమారపురంలోకి గోకులం గ్రాండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీలో ప్రస్తుతం ఉన్న నాయకులు అంతా దాచుకోవడం, దోచుకోవడానికే పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు. ప్రజల కోసం నిరంతరం తపించి వారి కోసం పనిచేసే నాయకుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. పిఠాపురాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దగల సత్తా పవన్‌కే ఉందన్నారు. తాను మే 11వ తేదీ వరకూ పిఠాపురం నియోజకవర్గంలో ఉండి పవన్‌ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. త్వరలోనే మరింత మంది స్టార్లు రాబోతున్నారని, ప్రచారం వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పారు. 2014 కూటమి రిజల్ట్‌ మరలా రీపీట్‌ అవుతుందని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి, సంక్షేమం, మహిళలకు భద్రత, రైతులకు భరోసా సాధ్యమని చెప్పారు. సమావేశంలో జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్‌ మర్రెడ్డి శ్రీనివాసరావు, నాయకులు కడారి తమ్మయ్యనాయుడు, వెన్నపు చక్రధరరావు, సూరవరపు సురేష్‌, తోలేటి శిరీష, మార్నీడి రంగబాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 01:25 AM

Advertising
Advertising