యానాం సమస్యలు పరిష్కరించండి: మల్లాడి
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:01 AM
యానాం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు.
యానాం. సెప్టెంబరు 9: యానాం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. పుదుచ్చేరి కలెక్టర్ కులంగోత్తన్‌తో సమావేశమయ్యారు. యానాం కనకాలపేటలో ఉన్న పిప్‌డిక్ భూవివాదాన్ని త్వరితగతిన పరిష్కరించాలని, యానాంలో ఇసుక సమస్యను, దీపావళి షాపులకు లైసెన్సుల జారీ అంశా లతో పాటు యానాం రిజిస్ర్టేషన్ కార్యాలయంలో సబ్‌రిజిస్టార్ పోస్టు నియామకం తదితర పెండింగ్ అంశాలపై చర్చించారు. దేవదాయశాఖ కమిషనర్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న యానాం వెంకన్న ఆలయ పునర్నిర్మాణ కమిటీ కాలపరిమితిని మరోఏడాది పొడిగించేలా సీఎం జారీ చేసిన ఆదేశాలను కమిషనర్‌కు అందజేశారు. అలాగే పెండింగ్ అంశాలపై చర్చించారు. అనంతరం పుదుచ్చేరి సహకారశాఖ, అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆ శాఖల సమస్యలను వివరించి పరిష్కరించాలని మల్లాడి కోరారు.
Updated Date - Sep 10 , 2024 | 12:01 AM