ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తాళ్లరేవులో వాటరు ప్లాంటు సీజ్‌

ABN, Publish Date - Jul 03 , 2024 | 12:12 AM

తాళ్లరేవు, జూలై 2: 216 జాతీయ రహదారి పక్కన గుండాబత్తులవారి నాన్‌లేవుట్‌లో ప్ర భుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సత్యశ్రీ వాటర్‌ ప్లాంటు ను స్థానిక పంచాయతీ, రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. మంగళవారం తూర్పుగోదావరిజిల్లా పుడ్‌సేఫ్టీ సహాయక ఆహార నియంత్రణాధికారి బి.శ్రీనివాస్‌, పుడ్‌సేఫ్టీ అధికారి సుబ్బారావు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాటరు ప్లాం టును తనిఖీ చేశారు. ప్లాంటులో ఏ పరీక్షలు నిర్వహించకుండా నకిలీ స్టిక్లర్ల

తాళ్లరేవు, జూలై 2: 216 జాతీయ రహదారి పక్కన గుండాబత్తులవారి నాన్‌లేవుట్‌లో ప్ర భుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సత్యశ్రీ వాటర్‌ ప్లాంటు ను స్థానిక పంచాయతీ, రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. మంగళవారం తూర్పుగోదావరిజిల్లా పుడ్‌సేఫ్టీ సహాయక ఆహార నియంత్రణాధికారి బి.శ్రీనివాస్‌, పుడ్‌సేఫ్టీ అధికారి సుబ్బారావు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాటరు ప్లాం టును తనిఖీ చేశారు. ప్లాంటులో ఏ పరీక్షలు నిర్వహించకుండా నకిలీ స్టిక్లర్లతో మంచినీటి బాటిళ్లను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వాటరు మిషనరీలు, వాటరు ట్యాంకులను సీజ్‌ చేశారు. రూ.14వేలు విలువచేసే బాటిల్స్‌, ప్యా కెట్లను గుర్తించి సీజ్‌ చేసి రెవెన్యూ అధికారులకు స్వాధీ నం చేశారు. శాంపిల్స్‌ను వెంట తీసుకుని వెళ్లి ప్లాంటు నిర్వహకుడు బోనగిరి రాజేష్‌పై క్రిమినల్‌, 6ఏ కేసులు నమోదు చేసి కలెక్టర్‌కు నివేదించనున్నట్టు తెలిపారు. స్థానిక రెవెన్యూ ఇనస్పెక్టర్‌ రవితేజ వాటరుషెడ్డుకు సీల్‌ వేసి సీజ్‌ చేశారు. వీఆర్వో వీర బాబు, పంచాయతీ కార్యదర్శి శంకరనారాయణ ఉన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 12:12 AM

Advertising
Advertising