ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలి

ABN, Publish Date - May 12 , 2024 | 01:01 AM

ఒక్కచాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ అమరావతి, పోలవరం నిర్మాణాలతో పాటు గ్రామాల అభివృద్ధిని కుంటుపర్చారని టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

కొవ్వూరులో ప్రచారం నిర్వహిస్తున్న కూటమి అభ్యర్థి ముప్పిడి

టీడీపీ-జనసేన-బీజేపీ కొవ్వూరు అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు

కొవ్వూరు, మే 11: ఒక్కచాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ అమరావతి, పోలవరం నిర్మాణాలతో పాటు గ్రామాల అభివృద్ధిని కుంటుపర్చారని టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరులోని 1,2,3 వార్డుల్లో శనివారం ద్విసభ్య కమిటి సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఓటు వేసే ముందు అనుభవానికా, అరాచకానికా ఆలోచించాలన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. జగన్‌రెడ్డికి సంపాదించుకోవడం, దోచుకోవడం తప్ప పరిపాలన తెలియదని ప్రజలకు అర్థమయ్యిందన్నారు. మౌలిక సదుపాయాలైన పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా లేక నియోజకవర్గ ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. దీంతో ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో వన్‌సైడ్‌గా జరగబోతున్నాయన్నారు. జగన్మోహనరెడ్డికి ఓటేయడమంటే మన భూ హక్కులని, మన ఆస్తి హక్కులపై అధికారాలన్నీ పూర్తిగా వైసీపీ నాయకులకు కట్టబెట్టినట్లేనని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థినైన తనకు సైకిల్‌గుర్తుపై, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓటువేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలోసూరపనేని చిన్ని, కౌన్సిలర్‌ బొండాడ సత్యనారాయణ, మద్దిపాటి మురళీ, పెనుమాక జయరాజు, కొల్లి రమేష్‌, కొప్పాక జవహర్‌,మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 01:01 AM

Advertising
Advertising