డ్రైనేజీల్లేవ్.. రోడ్లూ లేవు!
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:52 AM
స్వర్ణ గ్రామ పంచాయతీల పేరిట తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శుక్రవారం జిల్లాలో నిర్వహించన గ్రామ సభలకు సమస్యలు పోటెత్తాయి. జనం తండోపతండాలుగా తరలివచ్చి సమస్యలు మొరపెట్టుకున్నారు.
299 పంచాయతీల్లో గ్రామసభలు
ప్రజల నుంచి భారీ స్పందన
ఎక్కడికక్కడ సమస్యలతో క్యూ
సాయంత్రానికి తీర్మానాలు
అంచనాలతో నివేదికలు
( రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
స్వర్ణ గ్రామ పంచాయతీల పేరిట తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శుక్రవారం జిల్లాలో నిర్వహించన గ్రామ సభలకు సమస్యలు పోటెత్తాయి. జనం తండోపతండాలుగా తరలివచ్చి సమస్యలు మొరపెట్టుకున్నారు. జిల్లాలో 299 గ్రామ పంచా యతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రతి పంచాయతీలో డ్రైనేజీలు, రోడ్లు, పైపులైన్ లీకేజీలు, పారిశుధ్య, తాగునీరు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో సమస్య చెప్పడానికి వెనుకడుగు వేసే పరిస్థితి ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభలకు మాత్రం ప్రజలు స్వేచ్ఛగా వచ్చి తమ ఊరి సమ స్యలను ఏకరవు పెట్టారు. గ్రామాల్లో రాజకీయ పార్టీనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజలు సమస్యలను లేవ నెత్తారు. సభా ముగింపులో ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులపై తీర్మానాలు చేశారు. వేలాది పనులపై తీర్మానాలు జరిగాయి. అన్ని అంశాలు కలుపుకుంటే సుమారు రూ.1000కోట్లకు పైగా వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నా రు. జిల్లావ్యాప్తందా అన్ని గ్రామాల్లోనూ డ్రైనేజీ సమస్య ఉంది. సీసీ రోడ్ల సమస్య ఉంది. పైపులైన్ల సమస్య ఉంది. ఒక్కో పంచాయతీలో సుమారు 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకూ డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి.. కిలోమీటర్ల కొలదీ సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉన్నట్టు తేలిసింది. డ్రైనేజీల నిర్మాణానికే సుమారు రూ.500 కోట్ల వరకూ అవసరం ఉం టుందని భావిస్తున్నారు. సీసీ రోడ్లకు నిధులు అవసరం. వీటన్నింటినీ ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించనున్నారు. వేగంగా నిధులు విడుదల చేసి అన్నీ ప్రాధాన్యతా క్రమంగా పనులు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. సీతానగరం మండలం ముగ్గళ్లలో 75 వర్కులకు తీర్మానం చేశారు. ధవళేశ్వరం సుమారు రూ.50 కోట్ల విలువైన వర్కులకు తీర్మానాలు చేసినట్టు సమాచారం. ఇలా ప్రతి గ్రామంలోనూ ప్రజలు చెప్పిన అంశాలను తీర్మానాలు చేశారు. కొన్ని చోట్ల ప్రజలు గతంలో పనులు చేయకపోవడాన్ని నిలదీశారు. దేవ రపల్లి జగనన్న కాలనీల్లో ఇళ్ల మంజూరులో అన్యాయం జరిగిందని పలువురు వాపోయారు. అయితే ఆ పంచాయతీ వైసీపీ వార్డు సభ్యుడు పార్టీలకతీతంగా అర్హులకు ఇచ్చామని అనడంతో ఇళ్లు మంజూరుకానివారు తిరగబడ్డారు. గౌరీప ట్నంలో భూహక్కు రీసర్వేలో అవకతవకలు జరిగాయని రైతు లు ఫిర్యాదు చేశారు. దవళేశ్వరంలో ఎన్నిసార్లు చెప్పి, మా డ్రైన్ల పట్టించుకోరేంటని కొందరు ప్రశ్నించారు. ఇలా జిల్లాలో రికార్డు స్థాయిలో గ్రామ సభలు జరిగాయి. ప్రారం భంలో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రప టా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాట కూటేశ్వ రంలో మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి. ప్రశాం తి,ఎమ్మె ల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి,నల్లమిల్లి రామకృ ష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వేంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు నియోజకవర్గాల గ్రామ సభల్లో పాల్గొన్నారు.
పల్లె సమస్యలన్నీ పరిష్కరిస్తాం
మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, ఆగస్టు 23 : రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటో గ్రఫి శాఖా మంత్రి కందుల దురేష్ అన్నారు. నిడదవోలు మండలం కాటకూటేశ్వరం గ్రామంలో శుక్రవారం నిర్వహిం చిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సమస్యలు ప్రజల నుంచే తెలుసుకునేందుకు సభలు ఎంతో దోహద పడతాయన్నారు. గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడంజరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ ప్రజల హక్కులు బాధ్య తలు తెలుసుకునేందుకు వేదిక గ్రామ సభలన్నారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, సర్పంచ్ కొయ్యల వెంకటేశ్వరరావు,వైస్ సర్పంచ్ కొప్పిశెట్టి మంగరాజు,ఎంపీడీవో పి.శామ్యూల్ పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో అవకతవకలపై నిలదీత..
నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామ సభ రసా బాసగా మారింది.గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై గ్రామస్తులు అధికారులను నిలదీ శారు. ఉపాధి హామీ పనుల నిమిత్తం విడుదలైన నిధుల గురించి కల్పించిన పనిదినాల గురించి ప్రజలకు వివరణ ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారు.దీంతో గ్రామస్తుల కు అధికారులకు మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది.
Updated Date - Aug 24 , 2024 | 12:52 AM