ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజిలెన్స్‌ ఎస్పీ త్వరలో బదిలీ!

ABN, Publish Date - Jul 31 , 2024 | 01:04 AM

రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌(విజిలెన్స్‌ ఎస్పీ) కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి వారంలో బదిలీ కావొచ్చని తెలుస్తోంది.

రాజమహేంద్రవరం, జూలై 30(ఆంధ్రజ్యోతి): రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌(విజిలెన్స్‌ ఎస్పీ) కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి వారంలో బదిలీ కావొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పి.జగదీశ్‌, పాపారావు, ప్రసాద్‌, రాజేంద్ర కుమార్‌, సుమిత్‌ కుమార్‌ గాంధీ పేర్లు డీజీ వద్ద తుది పరిశీల నలో ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా వీరిలో ఒకరిని నియ మించాలని నిర్దేశించడంతో ఈ వారంలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. జగదీశ్‌ ఐపీఎస్‌, సుమిత్‌ కుమార్‌ ఐఏఎస్‌ అధికారులు. వీరిలో జగదీశ్‌ తూర్పు గోదావరి ఎస్పీగా పని చేసి ఇటీవల బదిలీ అయ్యారు. ప్రస్తుతం డీజీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ పోస్టింగ్‌ కోసం వేచి ఉన్నారు.పాపారావు జిల్లాలో అడిషనల్‌ ఎస్పీ(అడ్మిన్‌)గా విధులు నిర్వర్తించి ఏడాది కిందట బదిలీపై సీఐడీకి వెళ్లారు. సుమిత్‌ కుమార్‌ గాంధీ రాజమ హేంద్రవరం మునిసిపల్‌ కమిషనర్‌గా చేశారు. రాజేంద్ర కుమార్‌ గతంలో ఇదే విభాగంలో రాజమహేంద్రవరంలో డీఎస్పీగా పనిచేశారు. దీంతో ఇక్కడికే ఎస్పీగా రావడానికి గట్టిగా ప్రత్నిస్తున్నట్టు సమాచారం. ఆయనకే అధికశాతం అవకాశం ఉందని అంటున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 01:04 AM

Advertising
Advertising
<