ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేట్లపాలెంలో డయేరియా బాధితులు

ABN, Publish Date - Jun 22 , 2024 | 12:34 AM

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శుక్రవారం పలువురు విరేచనాలతో డయేరియా బారినపడి అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో జొన్నల దొడ్డి ప్రాంతంలో సుమారు 13 మంది విరేచనాలకు గురికాగా, వారిలో ముగ్గురికి ఉన్నత చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వేట్లపాలెం పీహెచ్‌సీ వైద్యులు అంబులెన్స్‌లలో తరలించారు.

వైద్య బృందంతో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌

  • ముగ్గురిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • మరో పది మందికి పలు ప్రైవేట్‌ ఆసుపత్రులలో చికిత్స

సామర్లకోట, జూన్‌ 21: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శుక్రవారం పలువురు విరేచనాలతో డయేరియా బారినపడి అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో జొన్నల దొడ్డి ప్రాంతంలో సుమారు 13 మంది విరేచనాలకు గురికాగా, వారిలో ముగ్గురికి ఉన్నత చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వేట్లపాలెం పీహెచ్‌సీ వైద్యులు అంబులెన్స్‌లలో తరలించారు. ఏడుగురికి వేట్లపాలెం పీహెచ్‌సీలో వైద్యులు డాక్టర్‌ హిమబిందు, డాక్టర్‌ పర దేశి ఆద్వర్యంలో వైద్యం అందిస్తున్నారు. మరో పదిమంది విరేచనాలతో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరినట్టు కుటుంబవర్గాల ద్వారా తెలిసింది. కాగా గ్రామంలో పలువురికి విరేచనాలతో డయే రియా బారినపడి అస్వస్థతకు గురైన సంఘటనపై అధికారులు ఉలిక్కిపడ్డారు. హుటాహుటిన వేల్లపాలెం వైద్యబృందం జొన్నలదొడ్డి ప్రాంతంతోపాటు గ్రామంలో ఇంటింటా పర్యటించి కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. విరేచనాలు వంటి లక్షణాలు కలిగిన పలువురిని గుర్తించి టాబ్లెట్‌లను అందించారు. అలాగే గ్రామంలో డయేరియా వ్యాధి ప్రబలిం దన్న సమాచారంతో సామర్లకోట ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌, ఈవో పీఆర్డీ హరికృష్ణసత్యారెడ్డి తదితర పంచాయతీ సిబ్బంది గ్రామంలో తాగునీటి పైప్‌లైన్‌లను పరిశీలించారు. పలు ప్రాం తాల్లో పైప్‌లైన్‌ లీకులను గుర్తించి అరికట్టాలని సిబ్బందికి ఎంపీడీవో సూచించారు. కాగా గ్రామంలో డయేరియా ఏవిధంగా ప్రబలింది, ఆహారం విషయంలో ప్రజలు ఏమేమి జాగ్ర త్తలు తీసుకున్నారనే అంశాలపై ఎంపీడీవో శ్యామ్‌ సుందర్‌ ఆరా తీశారు. జిల్లా వైద్యఆరోగ్య ఉన్నతాధికారులు ఇచ్చిన ప్రత్యేక ఆదే శాల మేరకు గ్రామంలో డయేరియా అదుపులోకి వచ్చేవరకూ వైద్యఆరోగ్య సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆదేశిం చారు. కాగా రాజధాని అమరావతి సచివాలయంలో శుక్రవారం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఉన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్పకు వేట్లపాలెం గ్రామంలో పలువురు డయేరి యా బారిన పడినట్ట్ల సమాచారం తెలిసి సత్వరం స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య వాఖ అధికారులకు, వేట్లపాలెం పీహెచ్‌సీ వైద్యులకు రాజధాని నుంచి ఫోన్‌ చేసి సమాచారాన్ని సేకరించా రు. పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

  • డయేరియా బారినపడినవారు వీరే..

కొమ్మొజు సత్యవేణి, పరిమి స్రవంతి, పైలా అక్షయ్‌లను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాలకుర్తి జ్యో తి, బిక్కిన భవాని, వడ్డాది పెద్దరాజు, వడ్డాది అప్పారావు, బంగా రు హరిచరణ్‌, పరిమి దివ్య, వడ్డాది వెంక టచరణ్‌, వడ్డాది రామ య్య, బడ్డేటి వెంకటేష్‌, బడేటి సుభాష్‌, వడ్డాది గన్నివర్ధన్‌, అభిషే క్‌, మానస, మనుపర్తి వేగేశ్వరరావు చికిత్స పొందుతున్నారు.

Updated Date - Jun 22 , 2024 | 12:34 AM

Advertising
Advertising