కడగండ్లు..కన్నీళ్లు
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:42 AM
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. అధికారుల నిర్లక్ష్యం కార ణంగా అనుకోని రీతిలో పంటలు దెబ్బతిన్నాయి.
గోకవరం, శ్రీరంగపట్నంలో గండి
ముంపు బారిన 9 గ్రామాలు
ఉప్పొంగుతున్న ఎర్రకాల్వ
గోకవరం, సెప్టెంబరు 9 : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. అధికారుల నిర్లక్ష్యం కార ణంగా అనుకోని రీతిలో పంటలు దెబ్బతిన్నాయి. గత కొద్ది రోజులగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న ప్పటికీ సంబంధిత అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న కాలువలు,చెరువుల బలహీనగట్లుపై దృష్టిసారించ లేదు. అధిక వర్షాలకు చెరువులు, కాలువలు పొంగి మండలం లోని ఓ కాలువకు సోమవారం గండిపడడంతో పాటు, 8 గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు బురద కాలువకు చేరడంతో సోమవారం ఆ కాలువ ఉధృతంగా ప్రవహించింది. గోకవరం మండలం తంటికొండ రెవెన్యూ పరిధిలో గల ఇసుపల్లివారి చెరువు నుంచి కళింగల ద్వా రా వరద నీరు ప్రవహిస్తూ బురదకాలువలోకి నీరు వెళ్లే కాలువ గట్టుకు గండిపడింది. దీంతో వందలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. దీంతో రైతులు తీవ్ర ఆం దోళనలో ఉన్నా రు.దీంతో పాటు ఊర కాలువ తన ఉగ్రరూపాన్ని చూపి ంది.ఈ కాలువకు సమీపంలో ఉన్న సంజీవయ్యనగర్ కాలనీ వాసులను మాజీ జడ్పీటీసీ పాలూరి బోస్, ఎంపీడీవో పద్మజ్యోతి, ఇతర అధికారులు అప్రమత్తం చేశారు.కాలువ వైపునకు స్థానికులు వెళ్ల కుండా పోలీ సులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అధిక వ ర్షాల కారణంగా మండలంలోని గోకవరం,రంపయ ర్ర ంపాలెం,గంగంపాలెం,తంటికొండ,కృష్ణునిపాలెం, కొత్తపల్లి, తిరుమలాయపాలెం, తదితర గ్రామాల్లో వరి పంట నీట మునిగినట్టు ఏవో రాజేశ్వరి సోమవారం తెలిపారు.
గోకవరంలో అత్యధిక వర్షపాతం
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 9: జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారి వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో సోమవారం గోకవరం మండలంలో అత్యధికంగా 61 మి.మీ వర్షపాతం నమో దైంది. దేవరపల్లి మండలంలో 42.1 మి.మీ, రాజానగరం 40.8 మి.మీ, రంగంపేట 37.2 మి.మీ, సీతానగరం 36.0 మి.మీ, కోరుకొండ 34.6 మి.మీ, రాజమహేంద్రవరం 32.8 మి.మీ, రాజమహేంద్రవరం రూరల్ 31.2 మి.మీ, గోపాలపురం 30.8 మి.మీ, తాళ్ళపూడి 30.2 మి.మీ, నల్లజర్ల 28.6 మి.మీ, నిడదవోలు 28.4 మి.మీ, కడియం 27.2 మి.మీ, ఉండ్రాజవరం 26.8 మి.మీ,చాగల్లు 26.4 మి.మీ, అనపర్తి 26.2 మి.మీ, పెరవలి 24.2 మి.మీ, కొవ్వూరు 22.8 మి.మీ, బిక్కవోలు 18.8 మి.మీ వర్షపాతం నమోదైంది.జిల్లాల్లో 606.2 మి.మీ వర్షం కురిసింది.
మళ్లీ మునిగిన
శ్రీరంగపట్నం
కోరుకొండ, సెప్టెంబరు 9 : బురద కాలువ ముం చేసింది.. ఊళ్లూ.. చేలు ఏకం చేసింది. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామాన్ని సోమవారం బురద కాలు వ వరదనీరు ముంచేసింది. అధిక వర్షాల కారణంగా జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి పొంగుతున్న వాగులు, వంకలు, నెల్లిపూడి కాలువ, బురద కాలువ, సూరంపా లెం రిజర్వాయర్ మిగులు జలాలు బురద కాలువలోకి రావడంతో ఉధృతి పెరిగింది. దీంతో బుర ద కాలువకు అనే క చోట్ల గండ్లు పడ్డాయి. ఈ నేప థ్యంలో లోతట్టు గ్రామమైన శ్రీరంగపట్నంను ముంచెత్తింది.గ్రామంలోని వంతెన పైనుంచి మూడు అడు గుల ఎత్తున ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. యానాదుల పేట,ఎస్సీపేట, బీసీ కాలనీ, పందులమ్మ గుడి ఏరియా, కేవీఆర్‌ప్రాథమిక పాఠశాల పరిసరాల్లో పెద్ద ఎత్తునబురదకాలువలో వరదనీరు చేరింది. గ్రామం లోకి 3 అడుగుల మేర వరద నీరు ప్రవేశించింది. సుమారు 500 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. జడ్పీ హై స్కూల్, రైతు భరోసా కేంద్రం, తుఫాన్ షెల్టర్లకు వరద బాధితులను తరలించారు.గ్రామంలోకి వరద నీరు రావడం, గడిచిన రెండు నెలల కాలంలో ఇది మూడోసారి. మూడు సార్లు వరద ముంపును ఎదుర్కొని గ్రామంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని.. బురద కాలువ నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శ్రీరంగపట్నం వరద ముంపుకు గురైన ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. జడ్పీ హైస్కూల్ వద్ద పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న వరద బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని భరో సా ఇచ్చారు.గ్రామంలో 4 మెడికల్ క్యాంపులు ఏర్పా టు చేశామని ఆహారం,మంచినీరు, పాలు,మందులు అందుబాటులో ఉంచామన్నారు. సూరంపాలెం రిజర్వాయర్ మిగులు జలాలు గ్రామంపై పడకుండా డైవర్షన్ కాలువ ద్వారా తొర్రిగడ్డకు మళ్లిస్తామన్నారు.బురద కా లువ వరద నివారణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.ముంపు ప్రాంతాలను రాజమహేంద్రవరం ఆర్‌డీవో కె.శివజ్యోతి,తహసీల్దార్ సుస్వాగతం, రెవె న్యూ, ఇరిగేషన్, పీఆర్ సిబ్బంది పరిశీలించారు.
రాపాక- నల్గొండ రోడ్డు మూసివేత
సీతానగరం,సెప్టెంబరు 9 : గోదావరి పోటు మీద ఉండడం..భారీ వర్షాలకు వరద నీరు రోడ్డెక్కడంతో ము ందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాపాక నుంచి నల్గొ ండ,కోటి కేశవరం వెళ్లే రహదారిని సోమవారం తహసీల్దార్‌ఎ.శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా మూసివేశారు.దీంతో రాపాక మీదుగా నల్లగొండ, కోటికేశవరం, గోకవరం, కోరుకొండ రాకపోకలు నిలిచిపోయాయి.
ఉప్పొంగుతున్న ఎర్రకాల్వ
నిడదవోలు, సెప్టెంబరు 9 : ఎర్రకాల్వ ఉప్పొంగు తుం ది. నిడదవోలు మండలం కంసాలిపాలెం, తాడేపల్లి గూడెం మండలం మాధవరం మధ్య ఎర్రకాలువ ప్రవా హం ఉధృ తంగా ఉంది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంగారెడ్డిగూడెం కొంగువారి గూడెంలో ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలా శయంలోకి వరద నీరు పోటెత్తుతోంది.దీంతో ఇప్పటికే ప్రాజెక్ట్ నుంచి రెండు గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీని కారణంగా నిడదవోలు మండలం కంసాలిపాలెం, రావి మెట్ల, శింగవరం తదితర గ్రామాల్లో ఇప్పటికే అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేప ట్టారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం, తాళ్ళపాలెం, రావిమెట్ల, కంసాలిపాలెం, శింగవరం గ్రామాల్లో ఐదు సహాయక (పునరావాస కేంద్రం) శిబిరాలను ఏర్పాటు చేశామని జిల్లా మైక్రో ఇరిగేషన్ అఽధికారి, నిడదవోలు మండల ప్రత్యేక అధికారి ఎ.దుర్గేష్ తెలిపారు.పునరావాస కేంద్రాల్లో వైద్య శిబి రాలను అందుబాటులో ఉంచామన్నారు.అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం సిటీ/రూరల్, సెప్టెంబరు 9 : అధిక వర్షపాతం కారణంగా ముం పు గ్రామాలపై దృష్టి సారించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.కలెక్టరేట్‌లో సోమ వారం అధిక వర్షపాతం నమోదు ముందస్తు చర్యలపై జేసీ ఎస్ చిన్నరాముడు, డీఆర్‌వో జి.నరసింహులతో కలెక్టర్ సమీక్షించారు. గండ్లు పండేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు, అక్కడ ఉన్న పరిస్థితులపై సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. ముంపు బాధిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మండల స్థాయిలో పునరావాస కేంద్రాలు,మెడికల్ క్యాంపులను సిద్ధం చేసుకోవాలన్నారు. గోకవ రం,కోరు కొండ, సీతానగరం,గోపాలపురం,దేవరపల్లి,నల్లజర్ల,సీతానగరం,పెరవలి,నిడదవోలు తదితర మండలాల తహశీల్దార్లతో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారు.
Updated Date - Sep 10 , 2024 | 12:42 AM