తీరంలో ఎగసిన రాకాసి అలలు
ABN, Publish Date - May 26 , 2024 | 01:26 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడు తున్నాయి. ఉప్పాడ శివారు కొత్తపట్నం, సుబ్బంపే ట, విద్యుత్‌ప్లాంటు సమీపం వరకు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో కెరటాలు విరుచుకు పడుతున్నాయి.
వాహనాలపై దూసుకెళుతున్న కెరటాలు
ఉప్పాడ(కొత్తపల్లి) మే 25: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడు తున్నాయి. ఉప్పాడ శివారు కొత్తపట్నం, సుబ్బంపే ట, విద్యుత్‌ప్లాంటు సమీపం వరకు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో కెరటాలు విరుచుకు పడుతున్నాయి. బీచ్‌రోడ్డులో శిఽథిలావస్థలో ఉన్న పెద్దవంతెన సమీపంలో నిర్మించిన అప్రోచ్‌రోడ్డు వంతెన పైనుంచి కూడా అలలు తీవ్రస్థాయిలో దూసు కొస్తున్నాయి. దీంతో వంతెన పైనుంచి కార్లు, ఆటోలు, బైక్‌లలో ప్రయాణించేవారు కెరటాల ధాటికి భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో సముద్ర కెరటాలు ధాటి నుంచి గ్రామం కోతకు గురైన మాయాపట్నం నుంచి కొత్తపట్నం వరకు నిర్మించిన జియోట్యూబ్ టెక్నాలజీ శిఽఽథిలావస్థకు చేరుకొంది. దీంతో ప్రతీ రోజూ సముద్రంలో ఏర్పడే పోటు,పాట్లకు కెరటాలు మత్స్యకారుల ముంగిట్లోకి చేరడం పరిపాటి. తుఫాన్, అల్పపీడనాల్లో తాటి ప్రమాణం ఎత్తులో ఎగసిపడే కెరటాలు శిఽథిలమైన జియోట్యూబ్ నుంచి నేరుగా మత్స్యకారుల గుడెసెల్లోకి దూసుకొస్తాయి. దీంతో రెండు మూడు రోజుల పాటు ఆయా పాకల్లో తలదాచుకొనే మత్స్యకార కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధం కారణంగా తీరప్రాంతా లకు చెందిన మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ల లేదు. కాగా మత్స్యకారుల్లో పలువురు అలివి వేట దారులు మాత్రం సముద్రం అల్లకల్లోలంగా ఉన్న ప్పటికీ యఽథావిధిగా వేటకు వెళ్లడం గమనార్హం.
Updated Date - May 26 , 2024 | 01:26 AM