ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి సర్వేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలి’

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:32 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ పేషీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఈరంకి సర్వేశ్వరరావు అక్రమాలపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని రావులపాలెం గ్రామానికి చెందిన బి.అనంతలక్ష్మి కోరారు.

అమలాపురంటౌన్‌, జూలై14: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ పేషీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఈరంకి సర్వేశ్వరరావు అక్రమాలపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని రావులపాలెం గ్రామానికి చెందిన బి.అనంతలక్ష్మి కోరారు. ఈమేరకు ఆమె అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు ఫిర్యాదు అందించింది. కలెక్టర్‌ పీఏగా చలామణి అవుతూ ప్రతి పనికీ ఒక రేట్‌ ఫిక్స్‌ చేసి అధికంగా సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చిన్న ఫైల్‌కు తొలుత రూ.20వేలు సమర్పించాలని, కలెక్టర్‌ సంతకం అయిన తర్వాత ఫైల్‌ను కింద సెక్షన్‌కు పంపించాలంటే రూ.80వేలు సమర్పించాలన్నారు. సర్వేశ్వరరావు అక్రమాలపై గత కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. సర్వేశ్వరరావు మాటకు ఎదురుచెప్పిన ఎంత ఉద్యోగి అయినా అక్కడి నుంచి బదిలీ అవాల్సిందేనన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అయితే ఉద్యోగం కూడా పోతుందన్నారు. ఈవిధంగా నలుగురు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధులనుంచి తొలగించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నలుగురిలో ఒకరైన తనను చెప్పిన మాట వినడం లేదని లైంగికంగా వేధించి ఉద్యోగం నుంచి తీయించి వేశాడన్నారు. ఈవిధంగా గడచిన రెండేళ్లలో లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించాడన్నారు. అతనికి వైసీపీ నేతల అండదండలు ఉన్నాయన్నారు. సర్వేశ్వరరావుపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు బయటపడతాయని ఫిర్యాదులో వివరించారు. ఎమ్మెల్యే ఆనందరావును వివరణ కోరగా తనకు ఒక మహిళ ఫిర్యాదు చేసిందన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:32 AM

Advertising
Advertising
<