సంస్కృతీ గోలీసోడా కంపెనీపై విజిలెన్స్ దాడులు
ABN, Publish Date - May 26 , 2024 | 01:37 AM
కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉన్న సంస్కృతీ గోలీ సోడా ఎంటర్‌ప్రైజెస్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు.
పెద్దాపురం, మే 25: కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉన్న సంస్కృతీ గోలీ సోడా ఎంటర్‌ప్రైజెస్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈదాడులు నిర్వహించారు. గోలీ సోడా బాటిళ్లపై నంబర్, తయారీ తేదీలు లేవని, గోలీ సోడా బాటిళ్ల నమూనాలను సేకరించినట్లు పేర్కొన్నారు. అలాగే గోలీసోడా కంపెనీ ప్యాకర్‌గా నమోదుకాలేదని, స్టాట్యూటరీ డిక్లరేషన్ లేదని, ధ్రువీకరించని తూకం యంత్రం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడు తూ అనధికార కూల్ డ్రింక్స్, సోడా పరిశ్రమలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు ముత్యాల నాయుడు, నాగవెంకటరాజు, జగన్నాథరెడ్డి, భార్గవమహేష్, లక్ష్మీనారాయణ, నవీన్, జీవా, శివ,వీరబాబు, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2024 | 08:20 AM