ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాజమహేంద్రవరం అభివృద్ధికి అంకితం

ABN, Publish Date - Apr 26 , 2024 | 12:09 AM

రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభివృద్ధికి అంకితమవుతానని బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు, కూటమి రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్‌ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య(అచ్చిబాబు)తో కలిసి ఆమె కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కొవ్వూరు మండలంలో రోడ్‌షో నిర్వహిస్తున్న పురందేశ్వరి, ముప్పిడి

  • జనసేన-టీడీపీ-బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి

కొవ్వూరు/తాళ్లపూడి, ఏప్రిల్‌ 25: రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభివృద్ధికి అంకితమవుతానని బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు, కూటమి రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్‌ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య(అచ్చిబాబు)తో కలిసి ఆమె కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొవ్వూరు మండలం ఆరికిరేవులలో ప్రారంభమైన రోడ్‌ షో కుమారదేవం, చిడిపి గ్రామాల మీదుగా తాళ్లపూడి మండలం తాడిపూడి, రాగోలపల్లి, వేగేశ్వరపురం మీదుగా రావులపాడు, మలకపల్లి నుంచి ధర్మవరం, పెనకనమెట్ట గ్రామాల్లో పర్యటించారు. దారి పొడవునా వారికి మహిళలు హారతులిచ్చారు. పురందేశ్వరి మాట్లాడుతూ తన తండ్రి చూపిన బాటలో నడుస్తూ, ప్రజా సేవకు అంకితమవుతున్నానని, 14 ఏళ్లుగా అందరూ తన పట్ల చూపుతున్న ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటును ఎంపీ అభ్యర్థినైన తనకు కమలం గుర్తుపై, ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుకు సైకిల్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలన్నారు. కేంద్రం నుంచి కావలిసిన వనరులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో అల్లూరి విక్రమాదిత్య, ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంటమణి రామకృష్ణారావు, టీవీ రామారావు, వట్టికూటి వెంకటేశ్వరరావు, పరిమి రాధ, కోడూరి లక్ష్మీనారాయణ, నాదెళ్ల శ్రీరామ్‌, తాడిమళ్ల విజయవాణి, మారిశెట్టి వెంకటేశ్వరరావు, సుంకర సత్తిబాబు, సూరపనేని చిన్ని, పాలడుగుల లక్ష్మణరావు, ఎంపీపీ కాకర్ల నారాయుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:09 AM

Advertising
Advertising