ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రజల్లో అవగాహనకే మాబ్‌ డ్రిల్‌: డీఎస్పీ

ABN, Publish Date - May 28 , 2024 | 12:52 AM

ఎటువంటి సంఘటనలు ఎదురైనా ఎదుర్కొనడానికి పోలీసుశాఖ సిద్ధంగా ఉందనే విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకే మాబ్‌డ్రిల్‌ నిర్వహించామని డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్‌ అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో పోలీసులు సోమవారం కడియంలో మాబ్‌డ్రిల్‌ నిర్వహించారు.

కడియం, మే 27: ఎటువంటి సంఘటనలు ఎదురైనా ఎదుర్కొనడానికి పోలీసుశాఖ సిద్ధంగా ఉందనే విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకే మాబ్‌డ్రిల్‌ నిర్వహించామని డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్‌ అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో పోలీసులు సోమవారం కడియంలో మాబ్‌డ్రిల్‌ నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ బి.తులసీధర్‌, ఎస్‌ఐ కృష్ణసాయి, పోలీసు సిబ్బంది హైస్కూల్‌ రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా పలువురు ఆందోళనకారులు పెట్రో బాంబ్‌లు విసిరారు, రాళ్లు రువ్వారు, దిష్టిబొమ్మలు దహనం చేశారు, నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారికి గట్టి వార్నింగ్‌లు ఇచ్చారు. ఇటువంటి చర్యలకు పాల్పడడం చట్టరీత్యా నేరమన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అన్నారు. అయితే ఆందోళనకారులు వెళ్లకపోవడంతో కొద్దిపాటి లాఠీచార్జి చేశా రు. అయినా వినకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు తగ్గకపోవడంతో కాల్పులు జరిపారు. దీంతో ఆందోళనకా రులు వెనుదిరిగారు. కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి కిందపడిపోవడం, ఆయనను మానవతా దృక్పథంతో పోలీసులు రక్షించిన అంశాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఇటువంటి సంఘటనలు జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయే చెప్పడమే మాబ్‌డ్రిల్‌ ఉద్దేశమన్నారు. ఆందోళనల్లో పాల్గొంటే జీవితం పాడవుతుందన్నారు. యువత కొన్ని సంఘటనలకు దూరంగా ఉండాలన్నారు.

Updated Date - May 28 , 2024 | 12:52 AM

Advertising
Advertising