ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలి

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:44 AM

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 24: రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ కూటమిని బలపరిచి ప్రజలు ఆశీర్వదించాలని ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా కోరారు. పెదశంకర్లపూడిలో బుధవారం ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు. సత్యప్రభ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం విఽధ్వంసానికి గు

మహిళలకు కరపత్రాలు అందజేస్తున్న సత్యప్రభ

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 24: రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ కూటమిని బలపరిచి ప్రజలు ఆశీర్వదించాలని ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా కోరారు. పెదశంకర్లపూడిలో బుధవారం ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు. సత్యప్రభ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం విఽధ్వంసానికి గురైందని, సైకో పాలనతో రాష్ట్రంలో 25 ఏళ్ళు వెనక్కి వెళ్లిందన్నారు. రాష్ట్రం అన్ని రం గాల్లో ప్రగతి బాట పట్టాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పెదశంకర్లపూడి సర్పంచ్‌ సూర్నీడి నాగరత్నం, టీడీపీ నాయకులు సూర్నీడి సురేష్‌, దళే నవీన్‌, వరుపుల రామకృష్ణ, జువ్విన తిరుపతిరావు, దళే సత్యానందం, దళే పెద్దకాపు, కొమ్ముల కన్నబాబు,యాళ్ళ జగదీష్‌ ఉన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. పెదశంకర్లపూడిలోని టీడీపీ కార్యాలయం వద్ద వారికి సత్యప్రభ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. చేరినవారిలో వడ్డి సత్య, వడ్డి సూరిబాబు, వడ్డి రాంజీ, గీసాల సోమరాజు, హనుమంతు సత్తిబాబు, మండల చక్రరావు, చలంశెట్టి శివ, తాటికాయల రాజు, యినగంటి సాయిబాబు ఉన్నారు. ఏలేశ్వరం మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, చిక్కాల లక్ష్మణరావు, నూకతాటి ఈశ్వరరావు, పెంటకోట శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:44 AM

Advertising
Advertising