ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మురికికూపంగా పంటకాలువ!

ABN, Publish Date - May 26 , 2024 | 11:14 PM

అది పంటపొలాలకు సాగునీరు అందించే కాలువ. కానీ ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడదు. చెత్తాచెదారం, మురుగునీరుతో మురికికూపంగా మారి డ్రెయిన్‌ను తలపిస్తుంది. దుర్గంధపూరిత వాతావరణంతో పట్టణ ప్రజలు పడే ఇక్కట్లు అన్ని ఇన్నీ కావు. అనారోగ్యాలకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నా అధికారులు, పురపాలకులకు పట్టదు. శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారింది.

పిఠాపురం మీదుగా వెళ్లే ఏలేరు (చెరుకుల) కాలువ

దుర్గంధపూరిత వాతావరణంతో ఇక్కట్లు

అనారోగ్యాలకు గురవుతున్నామని ప్రజల ఆవేదన

అది పంటపొలాలకు సాగునీరు అందించే కాలువ. కానీ ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడదు. చెత్తాచెదారం, మురుగునీరుతో మురికికూపంగా మారి డ్రెయిన్‌ను తలపిస్తుంది. దుర్గంధపూరిత వాతావరణంతో పట్టణ ప్రజలు పడే ఇక్కట్లు అన్ని ఇన్నీ కావు. అనారోగ్యాలకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నా అధికారులు, పురపాలకులకు పట్టదు. శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారింది.

పిఠాపురం, మే 26: పిఠాపురం పట్టణం మధ్యలో నుంచి ఏలేరు కాలువ వెళ్లుతుంది. సుమారు 3 కిలోమీటర్ల మేర పట్టణంలో ప్రవహించే ఈ కాలువను చెరుకుల కాలువగా వ్యవహరిస్తారు. పిఠాపురం పరిసర ప్రాంతాల్లోని పంటపొలాలకు సాగునీరు ఈ కాలువ ద్వారానే అందుతుంది. అయితే ఈ కాలువ చెత్తాచెదారంతో పేరుకుపోయి మురికికూపంగా మారింది. పట్టణ పరిధిలో ఉన్న చెరుకుల కాలువలోకి వివిధ ప్రాంతాల్లోని డ్రెయిన్లులో ఉన్న మురికి నీరు చేరుతోంది. అదే సమయంలో కాలువ సమీపంలో ఉన్న గృహాలు వారు లెట్రిన్‌ గొట్టాలను ఇందులోకి వదులుతుండడంతో పంటకాలువ కాస్తా మురుగుకాలువగా మారిపోయింది. మరోవైపు చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ కవర్లు, తాగేసిన కొబ్బరిబొండాలు, ఇతర వ్యర్థాలను ఇందులోనే వేస్తున్నారు. దీంతో పూడిక పెరిగిపోయి మురుగునీరు నిలిచిపోతుం డడంతో కాలువ మొత్తం దుర్గంధభరితంగా మారి దుర్వాసన వస్తోందని కాలువ వెంబడి నివసిస్తున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దోమ లు, ఈగలు బెడద పెరిగిపోయి పలు అవస్థలు పడుతు న్నామని వారు వాపోతున్నారు. ఇందిరానగర్‌ పరిసర ప్రాంతాల ప్రజలు పరిస్థితీ మరీ దారుణం. కాలనీ పూర్తిగా ఇదే కాలువ వెంబడి ఉండడంతో దుర్గంధంతో వీరు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. అనారోగ్యాల బారిన పడుతున్నామని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్గంధపూరిత వాతావరణంతో ప్రజలు, కలుషితమై చెత్తాచెదారంతో వస్తున్న మురుగునీటితో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.

ప్రభుత్వశాఖల మధ్య సమన్వయలోపం

ఏలేరు కాలువపై శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతున్నది. పూడుకుపోయిన చెరుకుల కాలువను తవ్వే విషయంలో ఇరిగేషన్‌, ము న్సిపల్‌ శాఖల మధ్య తరచూ వివాదాలు వస్తున్నాయి. బాధ్యత తమది కాదంటే తమది కాదని ఇరుశాఖలు వాదిస్తున్నాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల జోక్యంతో ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో పూడిక తొలగించడం, ఆ విధంగా తీసిన పూడికను రోడ్డుపైనే వదిలివేయడం, చివరకు మున్సిపాలిటీ తొలగించాల్సి రావడం నిత్యకృత్యంగా మారింది. 2 దశాబ్దాలుగా ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖల మధ్య పంచాయతీ నేటికి తేలలేదు. దీంతో ఈ కాలువ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.

నియంత్రణ నిల్‌, ఆక్రమణలు ఫుల్‌

ఏలేరు కాలువలోకి వ్యర్థాలు, చెత్తాచెదారం రాకుం డా నివారించడంలో పిఠాపురం మున్సిపల్‌ అధికార యంత్రాంగం విఫలమైంది. కాలువ వెంబడి ఉన్న భవనాల్లోని లెట్రిన్‌ గొట్టాలును నేరుగా కాలువలోకి పెట్టినా సదరు భవనాల యాజమానులపై చర్యలు లేకపోవడంతో అందరూ అదే పద్ధతి పాటిస్తున్నారు. మరోవైపు రోడ్డు పక్కల హోటళ్లు,తినుబండారాలు ఇత ర షాపులు, బండ్లుపై వ్యాపారాలు నిర్వహించేవారు దీనిని ఒక డంపింగ్‌యార్డుగా వినియోగిస్తున్నారనే విమర్శ ఉంది. అదే సమయంలో కాలువను పట్టణంలో పలుచోట్ల యథేచ్ఛగా ఆక్రమించారు. కాలువ ఉన్న వి స్తీర్ణంలో 70శాతంపైగా ఆక్రమణకు గురైనట్టు చెబుతున్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడులు, ఆపై భారీగా సొ మ్ములు చేతులు మారుతుండడంతో మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇ ది పట్టణ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి విషయంలో కావడంతో చెరుకుల(ఏలేరు) కాలువలో పూడికను పూర్తిగా తొలగించి ప్రక్షాళించాలని, అందులోకి చెత్తాచెదారం వేయకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 11:14 PM

Advertising
Advertising