ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

ABN, Publish Date - May 31 , 2024 | 11:48 PM

పిఠాపురం, మే 31: ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసిన వైసీపీ నేతలు కౌంటింగ్‌ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిది ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. పవన్‌ గెలుపును అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రల్లో ఇదొక భాగమని ఆరోపించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న దుష్పప్రచారం చూసి ప్రజలే ఆశ్చర్యపోతు

కౌంటింగ్‌లో అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నం

పిఠాపురం, మే 31: ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసిన వైసీపీ నేతలు కౌంటింగ్‌ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిది ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. పవన్‌ గెలుపును అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రల్లో ఇదొక భాగమని ఆరోపించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న దుష్పప్రచారం చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నెగ్గే జనసేన అధినేత పవన్‌ ఎన్నికను పాడు చేయాలనే కుట్రతో సీఎం జగన్‌ ఉన్నారని ఆరోపించారు. రౌడీషీటర్లను ఎన్నికల కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించే కుట్ర జరుగుతుందన్నా రు. వైసీపీ నాయకులు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు వద్ద ఏజెంటు ఫారాలు తీసుకుని రౌడీమూకలను కౌంటింగ్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కౌంటింగ్‌ను ఏదొక విదంగా నిలుపుదల చేయాలని చూస్తున్నారని, దీనిపై ఎస్పీ దృష్టిసారించాలని కోరారు. సమావేశంలో టీడీ పీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొండేపూడి సూర్యప్రకాష్‌, నాయకులు గుండ్ర సుబ్బారావు, బర్ల అప్పారావు, సోము సత్యనారాయణ, పిల్లి చిన్నా, నామా దొరబాబు, బొజ్జా సూరిబాబు, అడ్డూరి శ్రీను, కొరుప్రోలు శ్రీను, మొల్లి నాగమరిడిరాజు, గుత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 11:48 PM

Advertising
Advertising