ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పిఠాపురంలో గులకరాళ్లుతో వర్మ వినూత్న నిరసన

ABN, Publish Date - Apr 17 , 2024 | 12:26 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 16: పట్టణంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ ఎస్‌ఎన్‌ వర్మ గులకరాళ్లుతో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. జగన్‌రెడ్డి చేస్తున్న డ్రామాలను ప్రజలకు వివరించారు. జగన్‌లాగా ఉత్తుత్తి దా డులు చేయించుకోవాలంటే గులకరాళ్లు అమ్మబడును అంటూ ప్రచారం సాగించారు. పట్టణంలోని 13,17వార్డుల్లో వర్మ మంగళవారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జగన్‌రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి డ్రా

పిఠాపురంలో గులకరాళ్లుతో వర్మ వినూత్న నిరసన

పిఠాపురం, ఏప్రిల్‌ 16: పట్టణంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ ఎస్‌ఎన్‌ వర్మ గులకరాళ్లుతో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. జగన్‌రెడ్డి చేస్తున్న డ్రామాలను ప్రజలకు వివరించారు. జగన్‌లాగా ఉత్తుత్తి దా డులు చేయించుకోవాలంటే గులకరాళ్లు అమ్మబడును అంటూ ప్రచారం సాగించారు. పట్టణంలోని 13,17వార్డుల్లో వర్మ మంగళవారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జగన్‌రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి డ్రామాను ప్రజలకు వివరించేందుకు వి నూత్న పద్ధతిని ఎంచుకున్నారు. గులకరాయితో ఎవరైనా చనిపోతారా అంటూ ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వర్మ తెలిపారు. ఎన్నికల్లో 25-35సీట్లుకు మించి రావని తెలిసే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామాలా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లో గులకరాయితో దాడి చేయించుకుని డ్రామాను రక్తికట్టించారని, డ్రా మాను చూసి ప్రజలందరు నవ్వుకుంటున్నారని తెలిపారు. భారీ పోలీసుబందోబస్తు మధ్య తిరిగే జగన్‌పై దాడి జరిగితే నిందితులను పట్టుకోలేని స్థితిలో పోలీసు యంత్రాంగం, డీజీపీ, కమిషనర్‌ ఉన్నారని విమర్శించారు. ఇటువంటి కల్పిత దా డులను ప్రజలు నమ్మబోరన్నారు. చంద్రబాబు, పవన్‌పై రాళ్ల దాడి జరిగితే ఇప్పటి వరకూ ఒక్క పోలీసు అధికారి స్పందించలేదని, అంటే జగన్‌పై దాడి జరిగితేనే జరిగినట్టా అని ప్రశ్నించారు. వారిపై దాడి చేసిన వారిని ఇప్పటి వర కూ ఎందుకు పట్టుకోలేదని వర్మ ప్రశ్నించారు.

Updated Date - Apr 17 , 2024 | 12:26 AM

Advertising
Advertising